end
=
Thursday, September 19, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Relationship:ఈ బంధం కేవలం సెక్స్ గురించా?
- Advertisment -

Relationship:ఈ బంధం కేవలం సెక్స్ గురించా?

- Advertisment -
- Advertisment -

అనుకోకుండా జరిగే సంధర్భాలు వస్తాయి ఎవరికి అయినా. అలాంటి పరిస్థితి ఎవరికి అయినా ఎప్పుడు అయినా రావచ్చు. ఒక మనిషి ఒకరికి దగ్గర అయింది అంటే ఆమెకి/అతనికి చాలా కారణాలు ఉండచ్చు. అందులో కొన్ని చెప్పుకూనేవి చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. భావోద్వేగాలు(Emotions) అనేవి మనసు కి సంబధించినవి. ఏ సమయానికి ఎలా ఉంటమో కొన్నిసార్లు మనకే తెలియదు. అలాంటి పరిస్థితి లో మనకి బాగా ఇష్టం ఉన్నవారితే కలిసిపోతాం(Lets get Together). ఒకసారి కలిసాక(Sex) ఇలాంటిది మళ్లీ జరగకూడదని అనుకుంటున్నారా..? లేదు .. దానిని మళ్లీ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారో ఆలోచించాలి. శృంగారం అనేది కేవలం భార్యభర్తలకు సంబంధించినది, అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు.. దీనిలోనూ మార్పులు వచ్చాయి. పెళ్లికి ముందు లవర్ తో గడిపేవారు కొందరు ఉంటారు. కానీ ఈ మధ్య కొత్తగా ఫ్రెండ్స్(Best Friends) విత్ బెనిఫిట్స్ పేరిట… బెస్ట్ ఫ్రెండ్స్ కూడా రిలేషన్ లో ఉంటున్నారు. అంటే… వారు కూడా సెక్స్ లో పాల్గొంటారు. కానీ లవర్స్ కాదు.. అలా అని పెళ్లి చేసుకోరు. కేవలం ఫ్రెండ్స్ లా మాత్రమే ఉంటాం అంటూ ఒక కొత్త ట్రెండ్(New Trend) ని సెట్ చేస్తున్నారు. అయితే… ఇలాంటి రిలేషన్స్ పెట్టుకునే సమయంలో కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.

(మనసుకు నచ్చింది చేస్తేనే బతుక్కి అర్థం కదా..)

వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతున్నారా లేదా ఈ బంధం కేవలం సెక్స్ గురించా అని ఆలోచించడం చాలా ముఖ్యం. ఇది మళ్లీ జరగాలని మీరు కోరుకుంటున్నారా అనే దాని గురించి ఆలోచించడం ఉత్తమం. వెంటనే కాదు.. కావాలంటే రెండు, మూడు రోజులు సమయం తీసుకోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరికీ చేసిన పనిలో తప్పు లేదు అని అనిపిస్తేనే.. దానిని కొనసాగించాలి. పొరపాటుగా జరిగిందని మీరు భావించి.. మళ్లీ ఇలాంటిది జరగకూడదు అనుకున్నా.. వారికి వెంటనే చెప్పాలి. ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు.అంతేకాదు.. ఈ విషయంలో మీరు చాలా నిజాయితీగా(Honest) ఉండాలి. వారిపై ఇష్టం ఉన్నా… లేకున్నా.. ఈ విషయంలో అస్సలు అబద్దం చెప్పకూడదు. అయితే… ఒక్కసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత… మీ స్నేహం(Friendship) మునుపటి రోజులాగే ఉంటుందని భావించాలి. అంటే… మీరు తీసుకున్నంత క్యాజువల్ గా ఎదుటి వ్యక్తి తీసుకోకపోవచ్చు. కాబట్టి… వారితో మాట్లాడాలి. తమతో ఎప్పటిలాగే ఉండమని మనం చెప్పకూడదు వాళ్ళకే అనిపించాలి.ఆలానిపించే అంతవరకు మనం వేచి చూడాలి ఇబ్బంది పెట్టకూడదు వారికి కొంత సమయం ఇవ్వాలి. ఏ బందానికి ఐనా నమ్మకం చాలా అవసరం సుమీ.

(ఒక్క కౌగిలింతతో అన్నీ దూరం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -