- మనీలాండరింగ్ కేసులో ఆమె పాత్ర లేదని సుఖేష్ లేఖ
- నవంబర్ 10 వరకు మధ్యంతర బెయిల్ పొడగింపు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez)కు ఊరట లభించింది. శనివారం ఢిల్లీ (Delhi)హైకోర్టులో (High court) జరిగిన విచారణలో ఆమెకు మధ్యంతర బెయిల్‌ను (bail)పొడగిస్తూ.. పూర్తి విచారణను వచ్చే నెల నవంబర్ 10 వరకు వాయిదా వేసింది. అలాగే ఈడీ (ED) అందరికీ సంబంధించిన ఛార్జ్ షీటు (Charge seat)తో పాటు ఇతర డాక్యుమెంట్ల (document)ను సమర్పించాలని ఆదేశించింది. ఆగస్టు (august)17న ఈడీ జాక్వెలిన్ పై చార్జ్ షీటు దాఖలు చేసింది. చంద్రశేఖర్ (chandra shekar)నుంచి రూ.7 కోట్ల (7 cr) విలువ చేసే ఖరీదైన బహుమతులను (gifts) తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పటికే దేశం విడిచి వెళ్లకుండా ఆమెపై ల్యూక్ ఔట్ (lucke note)నోటీసులు జారీ చేశారు. మరోవైపు జైలులో (jail) ఉన్న కన్మన్ సుఖేష్ (sukesh)చంద్రశేఖర్ రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఎలాంటి సంబంధం లేదని తన లాయర్‌కు (lawer) లేఖ రాశారు. తనతో స్నేహంలో (friend) భాగంగానే బహుమతులు ఇచ్చానని చెప్పారు. రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కన్మాన్ చంద్రశేఖర్ అరెస్ట్ (arrest) అయిన సంగతి తెలిసిందే.