– మార్కెట్ కమిటీ నియామకంలో ఉద్యమకారులకు పెద్దపీట
– బీసీ సామాజిక వర్గానికి చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవి
– ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన వారందరికీ పదవులు
– హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యమకారులు
దౌల్తాబాద్ దుబ్బాక : మలిదశ తెలంగాణ(Telangana) పోరాటంలో తొలి నుండి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి ఉద్యమంలో తమదైన పాత్ర పోషించిన నాయకులకు దౌల్తాబాద్ ఉమ్మడి మండల మార్కెట్ పాలక కమిటీలు(Market Governing Committees) కీలక పదవులు వరించాయి. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేస్తూ మార్కెట్ కమిటీ పాలకమండలి కూర్పు జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు మొదటినుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ, పార్టీకి విధేయులుగా ఉంటున్న వారికి దక్కడం విశేషం. ఉమ్మడి దౌల్తాబాద్(Daulatabad) మండల పరిధిలోని తిమ్మకపల్లి గ్రామానికి చెందిన ఇప్ప లక్ష్మి కి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వరించగా, మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు వేమ శ్రీనివాస్ కు వైస్ చైర్మన్ పదవి లభించింది. అలాగే డైరెక్టర్లుగా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ పార్టీని నమ్ముకుని పని చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ పదవులను కట్టుబెట్టారు.
ముబారస్పూర్ గ్రామానికి చెందిన లక్ష్మణ్, తిరుమలాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ, దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన పబ్బా అశోక్, నాగరాజు, జాంగిర్ ,లింగం, మల్లేశం, నాగరాజు, బాల్ రెడ్డి, లక్ష్మి ,వెంకటరామిరెడ్డి, సంతోష్ కుమార్ లను మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించారు. బీసీ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం, మొదటి నుంచి పార్టీలో పని చేస్తున్న వారికి పదవులు కట్టిపెట్టడంతో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పించి మార్కెట్ కమిటీ పాలకమండలి పూర్తి చేయడం పట్ల ఆయా సామాజిక వర్గాల నాయకులు మెదక్(Medak) పార్లమెంట్ సభ్యులు(Members of Parliament) కొత్త ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యమమే ఊపిరిగా ఇప్ప కుటుంబం:
తెలంగాణ రాష్ట్ర సాధన మరిదశ పోరాటంలో ఇప్ప లక్ష్మి కుటుంబం మొత్తం ఉద్యమంతో మమేకమై నడిచిన వారే కావడం విశేషం. ఆమె కుమారుడు ఇప్ప దయాకర్ జిల్లా యువజన నాయకుడుగా కొనసాగడంతో పాటు ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా ఆయనపై కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా సడక్ బంద్ రహదారుల దిబ్బంధం లాంటి కార్యక్రమాలలో పాల్గొన్నందుకు ఇప్ప దయాకర్ పై ఇప్పటికీ పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఉద్యమ నాయకుడిగా కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలలో ఉమ్మడి దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా దయాకర్ కు ప్రత్యేక పేరు ఉన్నది. ముఖ్యంగా అప్పుల బాధతో ఆత్మహత్య(Suicide) చేసుకున్న రైతుల కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవడంలో దయాకర్ చురుకుగా పనిచేశాడు.
పది సంవత్సరాలుగా నిరంతరంగా ఉమ్మడి దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 50 కుటుంబాలకు పైగా నిరుపేద పెళ్లిళ్లకు పుస్తే మట్టిని పంపిణీ కార్యక్రమం చేశారు . వందకు పైగా రైతు కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలిచారు . ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య ప్రచురించిన ఉద్యమ చరిత్రలో విప్ప దయాకర్ పేరు నమోదు కావడం విశేషం . నిరుపేద విద్యార్థులకు(Poor Students) ప్రతి సంవత్సరం ఉచిత బస్సు పాసులను అందజేస్తూ తమదైన సేవా గుణాన్ని దయాకర్ చాటుకుంటున్నారు.ప్రస్తుతం వారి కుటుంబానికి చైర్మన్ పదవి తగ్గడం ఉద్యమకారులకు దక్కిన గౌరవంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.
రైతులకు అందుబాటులో ఉంటా:
సుదీర్ఘకాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నవారికి తగిన గౌరవం లభిస్తుంది అనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. పదవి ఇచ్చి గౌరవం కల్పించిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు(Harish Rao) గారికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి మండల నాయకత్వానికి కృతజ్ఞతలు. రైతులకు అందుబాటులో ఉండి ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని పథకాలు రైతులకు చేరే విధంగా కృషి చేస్తా. అందర్నీ కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగుతాం. గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలకి అనుగుణంగా రైతుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తా.
(కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి)