end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయంవిద్యా సంస్థలు పునఃప్రారంభం
- Advertisment -

విద్యా సంస్థలు పునఃప్రారంభం

- Advertisment -
- Advertisment -
  • ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యా సంస్థలు ఓపెన్‌

ఫిబ్రవరి 1 నుండి తెలంగాణలో విద్యా సంస్థలన్నింటినీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం, విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ర్ట విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశాలు జారీ చేశారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా జనవరి 8 నుండి 31 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం విధితమే. అయితే విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఫిబ్రవరి 1 నుండి అన్ని విద్యాసంస్థలను తెరవాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

పాఠశాలలు, కళాశాలలో కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని తెలిపారు. అందరూ కచ్చితంగా ముఖానికి మాస్క్‌ ధరించాలని, తరుచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో విద్యాసంస్థలు తెరవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. విద్యా సంస్థల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆమె ఆదేశించారు.

నిన్నటి పూలను బయటపారేయొచ్చా?

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -