- రూ. 25లక్షలు, అరకిలో బంగారం స్వాధీనం
వెబ్‌డెస్కు : మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నేటి ఉదయం నుంచే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేయగా ఆమెకు సంబంధించిన ఫైళ్లను సీజ్ చేశారు. నర్సాపూర్ మండలం చిప్పల్‌తూర్తి గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 59 లోని ఎంఓసి ఇవ్వడం కోసం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ నర్సాపూర్ ఆర్డీవో అరుణరెడ్డిలు కోటి రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం రావడంతో నేటి ఉదయం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పై ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆ ఇంట్లోని పత్రాలను నగదు సీజ్ చేశారు.
మరో బృందం ఏసీబీ అధికారులు నర్సాపూర్ ఆర్డీఓ క్యాంపు కార్యాలయంపై దాడి చేశారు. నర్సాపూర్‌లో ఏసీబీ దాడులు జరుగుతుండగానే హైదరాబాద్‌కు చెందిన అరుణరెడ్డి ఇంటిపై దాడి చేయగా అక్కడ రూ. 25లక్షల నగదుతో పాటు అరకిలో బంగారం ఉన్నట్టు ఏసీబీ అధికారులు ప్రకటించారు. నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే అంశంపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యాయం అడిగితే కులబహిష్కరణ చేశారు…
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోటి 20 లక్షల లంచం కేసులో ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్ నగేష్ నర్సాపూర్ ఆర్డీఓ అరుణరెడ్డి పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. మరి కొంతమంది ఎమ్మార్వోలు సైతం ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు బయట ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న తరుణంలో మొన్న జరిగిన కీసార కేసులో రెవెన్యూ అధికారుల విధులు బయటపడగా అదే స్థాయిలో జిల్లా అధికారితో పాటు డివిజన్ స్థాయి అధికారి కూడా ఆరోపణలు ఎదుర్కోవడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇంకో కేసుకు సంబంధించి పూర్తి వివరాలు బయాటకి రావాల్సి ఉంది.