end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Female Power:భారత్ లో దూసుకుపోతున్న స్త్రీశక్తి
- Advertisment -

Female Power:భారత్ లో దూసుకుపోతున్న స్త్రీశక్తి

- Advertisment -
- Advertisment -

ఆకాశంలో సగం,ఆది దేవత… తొక్కా తోలూ అంటూ మహిళలను ఎత్తేస్తున్నట్టు చూపిస్తూనే అణగదొక్కాల్సినంత(Undermining) తొక్కేసారు. కానీ రోజులు మారాయి. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంత పైకి లేస్తుంది…ఇది కరెక్ట్(Fact) గా ఇప్పడు మహిళలు చేసి నిరూపిస్తున్నారు. ఆకాశంలో సగం కాదు అంతా మేమే, అంతా మాదే అంటూ దూసుకుపోతున్నారు. మేము లేనిదే ప్రపంచం లేదంటూ పైపైకి ప్రయాణం చేస్తున్నారు. స్త్రీల మీద అఘాయిత్యాలు(Atrocities) ఆగలేదు, ఎక్కువే అవుతున్నాయి….కానీ అంతే సమానంగా ఫైటింగ్ స్పిరిట్(Fighting spirit) ని కూడా చూపిస్తున్నారు. మేము మాలానే ఉంటాం, మాకోసమే బతుకుతాం అంటూ గొంతెత్తి నినదిస్తున్నారు. ఇదిలాగే కొనసాగాలి, పల్లె, పట్నం, చదువుకున్నవారు, లేనివారు తేడా లేకుండా అందరూ తమ జీవితాలు జీవించాలి. దానికోసం బాటలు వేస్తున్నవారే ఇప్పుడు సక్సెస్(Success) ను తమ సొంతం చేసుకున్న మహిళలు.

మరికొన్ని రోజుల్లో 2022 అయిపోతోంది. ఒక్కసారి యేడాది మొత్తాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే భారతదేశాన్ని ప్రభావితం చేసిన, న్యూస్ లో నిలిచిన వనితలు ఎందరో ఉన్నారు. దేశ రాష్ట్రపతి నుంచి కొంతమంది సామాన్య మహిళలు వరకూ న్యూస్ మేకర్స్(News Makers) గా నిలిచారు. ట్రెండింగ్ లో ఉంటూ తమ స్పెషాలిటీని (Speciality)నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఈ సంఖ్య పదుల్లోనే ఉన్నా వందలు, వేల మందికి ఇన్సిరేషన్ గా మాత్రం నిలవగలిగారు. మరెంతోమంది విజయాలు సాధించడానికి దారులు వేసారు.

(mallanna jātara:స్వామివారికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి)

చరిత్రలో నిలిచే రాష్ట్రపతి:

2022 వుమన్ న్యూస్ మేకర్స్ లో మొదట చెప్పుకోవలసిన వ్యక్తి ద్రౌపది ముర్ము(Draupadi Murmu). తన అస్థిత్వాన్ని నిలుపుకుని…ఎక్కడో అట్టడుగు వర్గం నుంచి దేశ ప్రథమ పౌరురాలిగా ఎదిగి చూపించారు. ఒక దళిత మహిళ భారతదేశ రాష్ట్రపతి అవడం ఇదే మొదటిసారి. చరిత్రలో నిలిచే అంశం. అందుకే టాప్ లేడీగా మొట్టమొదటి స్థానంలో నిలిచారు ద్రౌపది ముర్ము.

మధబి పురి:

సెబీ….ఇండియన్ మర్కెట్(Indian Market) మొత్తాన్ని కంట్రోల్ చేసేది. ఎంత పెద్దదో అందరికీ తెలిసినదే. మామూలుగా అయితే ఐఏఎస్ లాంటి పెద్ద పొజిషన్ లో ఉన్నవాళ్ళు దీనికి హెడ్ గా ఉంటారు. కానీ ఒక ఐఐఎమ్ గ్రాడ్యుయేట్, విపరీతమైన పోటీని, మేల్ ఛావనిజాన్ని దాటుకుని హెడ్ గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని సాధించారు మధబి పురి. సెబీకి ఫస్ట్ వుమెన్ హెడ్ గా నియమితులయ్యి వార్తల్లోకి ఎక్కారు.

సమంతా:

తెలుగువారికి సమంతా గురించి తెలియనది ఏముంటుంది. ప్రత్యేకంగా చెప్పక్కర్లేని స్టోరీ సమంతాది. ఇండిపెండెంట్ వుమెన్ గా సమంతా నిలబడటానికి చేసిన పోరాటం, ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు, ఆరోగ్యసమస్యలు, పోరాటాలు, సాధించిన విజయాలు అన్నీ కలిపి ఆమెను అందనంత ఎత్తుకు తీసుకెళ్ళాయి. ఒక పెద్ద ఫ్యామిలీని ధైర్యంగా తోసిరాజన్న సమంతా ధైర్యం ముందు అన్నీ తలవంచాయి. సక్సెస్ కాళ్ళ ముందు నిలిచింది. ఒక్క పాట చాలు తానేంటో తెలుసుకోవడానికి. దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చూసుకోవడానికి.

ఫల్గుణి నాయర్:

నాయకా….ఫేషన్ రంగంలోకి దూసుకువచ్చి, తన ప్రొడక్ట్స్ తో మహిళలను తన వశం చేసుకున్న కంపెనీ. దాదాపు అన్ని రకాల బ్యూటీ అండ్ ఫేషన్ ప్రొడక్ట్స్(Beauty and Fashion Products) ను అందరికీ కావల్సిన ధరలలో అమ్మతూ టాప్ లో నిలిచింది. దీని ఫౌండర్, ఓనర్ ఒక మహిళ. ఫల్గుణి నాయర్….భారతదేశ బిలయనీర్లలో ఒకరుగా నిలిచిన వనిత. ఒక సెల్ఫ్ మేడ్ వుమెన్ బిలయనీర్ గా ఎదిగారు. అదే ఆమెను వార్తల్లో వ్యక్తిగా నిలబెట్టింది.

ఝులన్ గోస్వామి:

భారత మహిళా క్రికెట్ లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్ తర్వాత మహిళా క్రికెట్ లో పాపులర్ అయిన క్రికెటర్ ఘులన్ గోస్వామి. దాదాపు 20 ఏళ్ళు భారత మహిళల జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై మోసింది. 2002లో చెన్నై స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ తో అడుగు పెట్టిన ఝులన్ 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఇంగ్లండ్ మీద తన చివర మ్యాచ్ ను ఆడింది. క్రికెటర్ గా ఎన్నో రికార్డులను అందుకున్న ఆమె లైఫ్ ఎందరికో ఆదర్శం.

నిఖత్ జరీన్:

ప్రపంచ బాక్సింగ్(Boxing) ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి, ప్రపంచంలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్.ప్రపంచ వేదికపై సత్తా చాటి, విజయంతో తిరిగి రావడం కంటే నిఖత్ జరీన్ కు కానీ మనకు కానీ ఇంకేం పెద్ద బహుమతి ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా వస్తోన్న మూస పద్ధతులను, అసమానతలను తన ఆటతో అధిగమించింది. ముఖ్యంగా, ఈ శారీరక క్రీడలో బాలికలు సమానంగా నైపుణ్యం కలిగి ఉంటారని నిరూపించడానికి ఈ నిజమాబాద్ ఛాంపియన్ బాక్సింగ్‌ను తన కెరీర్‌గా ఎంచుకుంది. మొదట్లో ఎన్నో కష్టాలు పడిన జరీన్..  ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి అందరి నోళ్ళూ మూయించింది.

నిర్మలా సీతారామన్:

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా నాలుగో ఏడాది నిలిచారు. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో నిర్మల సహా మరో ఐదుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. అయితే ఇందులో భారత్ తరపున నిర్మలానే ముందున్నారు.నిర్మలకు 36వ శక్తివంతమైన మహిళగా చోటు దక్కింది. ఆమె తొలిసారి 2019లో ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించారు.2019లో 34వ ర్యాంకు దక్కింది. తర్వాత ఏడాది 2020లో 41వ స్థానం, అనంతరం 2021వ ఏడాది 37వ స్థానాలు వచ్చాయి. ఇక ఈసారి కూడా 100 జాబితాలో 36వ ర్యాంకు దక్కింది.

కిరణ్ మజుందార్ షా:

భారతీయ వ్యాపారవేత్త. ఆమె బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, భారతదేశంలోని బెంగుళూరులో ఉన్న బయోటెక్నాలజీ సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కు మాజీ చైర్‌పర్సన్. 2014లో, సైన్స్, కెమిస్ట్రీ పురోగతికి విశేష కృషి చేసినందుకు ఆమెకు ఓత్మెర్ గోల్డ్ మెడల్ లభించింది. నాయకా ఫౌండర్ ఫాల్గుణి తర్వాత సెల్ఫ్ మేడ్ బిలయనీర్ గా వార్తల్లో నిలిచిన వ్యక్తి కిరణ్.

సుధా కొంగర:

మహిళా దర్శకురాలు. డైరెక్టర్ గా మొదటి సినిమా నుంచీ హిట్ కొట్టారు. తాజాగా తాను దర్శకత్వం వహించిన సురారై పొట్రు సినిమాకు రెండు నేషనల్ అవార్డులు సాధించి వార్తల్లో నిలిచారు.

రోషిణీ మల్హోత్రా:

హెచ్సీఎల్…అతి పెద్ద దేశీ కంపెనీల్లో ఇది ఒకటి. దీనికి ఛైర్ పర్శన్ రోషిణీ మల్హోత్రా. హెచ్ సీఎల్ కి ఫస్ట్ వుమెన్ ఛైర్ పర్శన్ కూడా ఈమెనే. భారత మహిళా బిలయనీర్లలో రోషిణీ ఒకరు.

పైన చెప్పిన వాళ్ళందరూ వార్తల్లో ప్రముఖంగా కనిపించారు. గూగుల్ లో వీళ్ళ కోసం ఎక్కువ సెర్చ్ చేశారు. కానీ మహిళా విజయం వాళ్ళతోనే ఆగిపోలేదు. అక్కడే ఉండిపోలేదు. సరిగ్గా చూస్తే మన చుట్టూ బోలెడంత మంది విజేతలు కనిపిస్తారు. వాళ్ళల్లా బిలయనీర్లు లేదా పెద్ద నెద్ద పదవుల్లో ఉండి ఉండకపోవచ్చును కానీ తమ జీవితాల్లో ఉన్నతంగా నిలబడిన, నిలబడుతున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. లిస్ట్  వేస్తే పేజీలు నిండిపోతాయి, పెద్ద పుస్తకాలు తయారవుతాయి. గో ఆన్ గర్ల్స్…..మీరు సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముందున్నది అంతా మహిళలకే….భవిష్యత్తు వాళ్ళదే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -