శ్రీశైలం వెళ్లే రహదారి అమ్రబాద్ మండలం మన్ననూర్ వద్ద గల దర్గా వద్ద రక్షణ గోడ కూలిపోయింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్లేవారు బయపడుతున్నారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షం వల్ల ఘాట్ రోడ్లు, గుట్టలు తడిసిపోయాయి. అక్కడక్కడ మట్టి గడ్డలు పడుతున్నాయి. కానీ మన్ననూర్ వద్ద రక్షణ గోడ కూలిపోయింది. ఈ సంఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం వెళ్లే వాహనాలను అదుపు చేస్తున్నారు. కర్ణాటక నుండి భారీగా వరదనీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి వస్తుండడంతో జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టును చూడడానికి జనం పొటెత్తుతున్నారు.