– శునకాలను రీప్లేస్ చేస్తున్న చైనీస్ టెక్నాలజీ
– ఒక్కో కుక్క ధర రూ. 12 లక్షల వరకు డిమాండ్
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రోబో (Robo) సేవలు పెరుగుతున్నాయి. న్యూస్ ప్రెజెంటర్ (News presenter), సేల్స్ పర్సన్ (sales person), డ్యాన్సర్ (dancer).. ఇలా ఇప్పటికే ఎన్నో పాత్రలు పోషిస్తున్న రోబో త్వరలో మనిషి పట్ల అత్యంత విశ్వాసం కలిగిన జంతువైన ‘కుక్క’ ను కూడా రీప్లేస్ చేయబోతోంది. ఇప్పటికే రోబో డాగ్స్ (Robot Dogs) చైనా (china)లోని పలు నగరాల్లో ట్రెండ్‌గా (trend) మారగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ (video viral) అవుతున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తుండటం, అసలు శునకాలు కంటికి కూడా కనిపించక పోవడం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
రోబోటిక్ కంపెనీ బోస్టన్ డైనమిక్స్ (Boston Dynamics) యొక్క ఇంప్రెసివ్ క్రియేషన్స్ (Impressive creations) ద్వారా ప్రేరణ పొందిన రోబోటిక్ డాగ్‌లు కొంతకాలంగా చైనీస్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవలే ప్రజాదరణ పొందడం ప్రారంభించాయి. తమ యజమానులను బేషరతుగా ప్రేమించే నిజమైన కుక్కలతో ఎప్పటికీ పోల్చలేని ఆత్మలేని యంత్రాలుగా వీటిని వర్ణిస్తున్నప్పటికీ, రోబో పెట్ (pet) డాగ్స్ తో ప్రయోజనాలను కాదనలేము అంటున్నారు చైనీస్ యూత్. అంతేకాదు ఇటీవల చైనాలో తమ రోబోట్ కుక్కలను నడపడాన్ని గుర్తించిన వారి సంఖ్యను బట్టి చూస్తే.. త్వరలోనే నిజమైన జంతువులతో పోటీ పడవచ్చు అనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.
(సహోద్యోగితో సహజీవనం… మరో ఇద్దరు పిల్లలకు తండ్రైన ఎలాన్ మస్క్?)
రోబోట్ కుక్కను ఎందుకు పెంచుకోవాలి?
ఇలాంటి సందేహం చాలా మందికి కలగవచ్చు. కానీ నిజమైన శునకంతో పోలిస్తే రోబో డాగ్ తో అధిక ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు తయారీదారులు. వాటికి ఎలాంటి ఆహారం అవసరం లేదు, శుభ్రం చేయవలసిన పని లేదు, ఓనర్స్ (owners) బిజీగా (busy) ఉన్నప్పుడు అవసరం లేకపోయినా వాటితో సమయం గడపవలసిన అవసరం లేదు. సంతోషంగా ఉన్న కుక్క యజమాని, పెంపుడు జంతువులను ఓన్ చేసుకునే వ్యక్తులకు ఈ సేవ ఆనందాన్ని ఇచ్చినా.. ఇలాంటి అవాంతరాలు లేని సహచరుడిని కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ రోబో డాగ్స్. ఈ పద్ధతి సరైనది కానప్పటికీ, వాటిని సులభంగా (easy) నిర్వహించవచ్చు.
అనేక చైనీస్ వార్తా సంస్థల ప్రకారం, షాంఘై (Shanghai), బీజింగ్ (Beijing) వంటి చైనీస్ నగరాల వీధుల్లో కనిపించే రోబోట్ కుక్కలలో ఎక్కువ భాగం దేశీయంగా ఉత్పత్తి చేయబడినవే కావడం విశేషం. ఫాలోయింగ్, రోలింగ్, (roling) సిట్టింగ్, (sitting) రన్నింగ్ (running) తో పాటు బరువులు మోయడం(5kg వరకు) వంటి అనేక అంతర్నిర్మిత లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇక కుక్క తలలో ఉన్న కెమెరా (camera) ఎదురుగా ఉన్న వస్తువులను గుర్తించి సరైన దారిలో వెళ్లేందుకు, యజమానిని గుర్తించేందుకు సాయపడుతుంది. చైనీస్ రోబోట్ డాగ్‌ల ధరలు బిల్డ్ క్వాలిటీ (Build quality), బిల్ట్ ఇన్ ఫీచర్స్ (built in features), బ్యాటరీ లైఫ్ (battery) ఆధారంగా దాదాపు రూ. 2లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య మారుతూ ఉంటాయి. అయితే ఈ రకమైన ఉత్పత్తికి సగటు బ్యాటరీ లైఫ్ సుమారు 45 నిమిషాలు ఉన్నందున.. మేజర్ డీల్ (majer) బ్రేకర్ (breaker)గా మారుతుంది. ఇక ఇప్పుడిప్పుడే చైనీస్ కస్టమర్స్ వీటిని యాక్సెప్ట్ (accept)చేయడం మొదలుపెట్టగా.. సమీప భవిష్యత్తులో తమ ఉత్పత్తుల మార్కెట్ బిలియన్ల డాలర్లకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు తయారీదారులు.
(chloecherry: 18 ఏళ్లకే కంట్రోల్ తప్పా…)