end

ఓపెనర్లుగా రోహిత్‌, మయాంక్‌ బెటర్‌: హర్భజన్‌

ఆస్ట్రేలియాతో భారత్‌.. 3 టీ20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచులాడనుంది. లిమిటెడ్‌ ఓవర్ల మ్యాచ్‌లకు కెప్టెన్‌ కోహ్లి అందుబాటులో ఉంటాడు. కానీ, చివరి మూడు టెస్టులకు అతను జట్టుతో ఉండడు. వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశానికి తిరిగిరానున్నాడు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ రహానే కెప్టెన్సీ వహిస్తాడు. కాగా, తొలి టెస్టు అనంతరం జట్టు కూర్పు ఎలా ఉండాలనేది వెటరన్ ఆటగాడు భజ్జీ కొన్ని సూచనలు చేశాడు. కెప్టెన్‌ కోహ్లి స్వదేశానికి తిరిగి వస్తుండడంతో అతని స్థానంలో రోహిత్‌ శర్మను జట్టు ఎంపిక చేసింది. సో, రోహిత్‌ లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్లలో సూపర్‌ ఓపెనర్‌. ఇటీవల టెస్టుల్లో కూడా రోహిత్‌ ఓపెనర్‌గా మంచి ప్రతిభ కనబరిచాడు.

అందుకే మయాంక్‌ అగర్వాల్‌కు తోడుగా రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా వస్తే జట్టుకు ప్రయోజనముంటుందన్నాడు భజ్జీ. రెగ్యులర్ ఓపెనర్‌ కె ఎల్‌ రాహుల్ ఏ స్థానంలోనైనా తన సత్తా చాటగలడని హర్భజన్‌ ప్రశంసించాడు. కోహ్లి ఇక తన రెగ్యులర్‌ స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలని ఆయన పేర్కొన్నారు. పేసర్లు బుమ్రా, షమీ, ఇషాంత్‌.. ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయగలరని భజ్జీ ధీమా వ్యక్తం చేశాడు.

Exit mobile version