end

Cricket:కోహ్లీని ఎత్తుకున్న రోహిత్..

  • విరాట్ పోరాటానికి ఫిదా అయిన భారత సారథి
  • మైదానంలోనే భుజంపై ఎత్తుకుని సంబరాలు
  • వైరల్ అవుతున్న వీడియో, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్

ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు (cricket fans) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్ (world cup)2022 సూపర్ 12లో భాగంగా భారత్, పాకిస్తాన్ (india vs pakistan)మధ్య మ్యాచ్ ఘనంగా ఆరంభం అయింది. ఉత్కంఠకే ఊపిరి అందని మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయాన్నందుకుంది. పాక్ నిర్ధేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. భారత్ విజయంలో కింగ్ విరాట్ కోహ్లీ (virat kohli) (82), హార్దిక్ పాండ్యా (hardik pandya) (40) కీలక పాత్ర పోషించారు. పాక్ బౌలర్లలో హరీస్ రవూఫ్ (hariss), మహ్మద్ నవాజ్ (nawaz)తలో రెండు వికెట్స్ పడగొట్టారు.

మెల్ బోర్న్ (Melbourne)మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సాధించి పెట్టిన విజయంతో తనను ఛేజింగ్ మాస్టర్‌ (changing master)గా ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించుకున్నాడు. కోహ్లీ కీలక ఈ ఇన్నింగ్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (rohit sharma)తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను, ఆటగాళ్లను చాలా సంతోషపెట్టింది. ఈ హైఓల్టేజ్ (hi voltage)మ్యాచ్‌లో కింగ్ విరాట్ కోహ్లీ(53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 నాటౌట్) అసాధారణ ఆటతీరుతో ఓటమి నుంచి గట్టెక్కించాడు. 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును విరాట్ తనదైన బ్యాటింగ్‌ (batting)తో ఆదుకున్నాడు. దీంతో గత ప్రపంచకప్‌ ఓటమికి పాక్‌పై ప్రతీకారం (revenge)తీర్చుకున్నట్లు అయింది. 

31 పరుగులకే 4 వికెట్లు..

168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ (shock) తగిలింది. ఓపెనర్లు (openers)కేఎల్ రాహుల్ (rahul)(4), రోహిత్(4) శర్మ వెను వెంటనే పెవిలియన్ (pavilion)చేరారు. నసీమ్ షా (nasheem)వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ బంతి వికెట్లపై ఆడుకోని పెవిలియన్ చేరగా.. హారిస్ రౌఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ స్లిప్ క్యాచ్‌‌గా (catch)ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ (surya kumar)యాదవ్ రెండు బౌండరీలతో దూకుడు కనబర్చాడు. కానీ అతని జోరుకు హరిస్ రౌఫ్ బ్రేక్ వేసాడు. షాట్ పిచ్ బాల్‌తో కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పవర్ ప్లేలో (powerplay)టీమిండియా మూడు వికెట్లకు 31 పరుగులు (runs)మాత్రమే చేసింది.

ప్రయోగం విఫలం:

ఇక అక్షర్ పటేల్‌ (akshar patel)ను టాపార్డర్ బ్యాటర్‌ (top order batter)గా ప్రమోట్ చేస్తూ టీమ్‌మేనేజ్‌మెంట్ (management) చేసిన ప్రయోగం వికటించింది. అక్షర్ పటేల్.. విరాట్ కోహ్లీతో సమన్వయ లోపంతో రనౌట్‌గా (run out) వెనుదిరిగాడు. అయితే ఈ రనౌట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. బంతి కన్నా ముందే రిజ్వాన్ (rizwan)గ్లోవ్స్ వికెట్లను తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ (empire)మాత్రం (out)ఔటిచ్చాడు. దాంతో భారత్ 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాతో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు.

విరాట్, హార్దిక్ కీలక భాగస్వామ్యం: (partner ship)

ఆత్మరక్షణగా ఆడిన ఈ జోడీ వీలు చిక్కిన బంతిన బౌండరీకి (boundary)తరలించారు. వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 10 ఓవర్లలో 4 వికెట్లకు 45 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత జోరు కనబర్చిన ఈ జోడీ.. మహ్మద్ నవాజ్ వేసిన 12 ఓవర్లలో మూడు సిక్స్‌లు (sixes) బాదారు. ఆ తర్వాత అదే జోరు కనబరుస్తూ స్కోర్ బోర్డు (score board)ను పరుగెత్తించారు. హరీస్ రౌఫ్, నసీమ్ షా 16,17 ఓవర్లు కట్టడిగా వేయడంతో టీమిండియా రిక్వైడ్ (required run rate)రన్‌రేట్ బాగా పెరిగింది. షాహిన్ షా వేసిన 18 ఓవర్లలో విరాట్ కోహ్లీ మూడు బౌండరీలు (boundary)బాది 17 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ (half century)పూర్తి చేసుకున్నాడు.

(Cricket:భారత్ అద్భుత విజయం…)

విరాట్ విశ్వరూపం: (Virat on fire)

హరిస్ రౌఫ్ వేసిన 19 ఓవర్లో విరాట్ కోహ్లీ రెండు సిక్స్‌లు బాదడంతో 15 పరుగులు (runs)వచ్చాయి. దాంతో చివరి ఓవర్‌ (last over)లో భారత్ (india)విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. తొలి బంతికి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (dinesh karthik)సింగిల్ తీయడంతో 4 బంతుల్లో 15 పరుగులు అవసరమయ్యాయి. మూడో బంతికి క్విక్ డబుల్ తీసిన విరాట్ కోహ్లీ… షాదాబ్ వేసిన నోబాల్‌ను (no ball)సిక్స్‌గా మలిచాడు. దాంతో చివరి మూడు బంతుల్లో 6 పరుగులు అవసరమయ్యాయి. ఫ్రీ హిట్ (free hit)బాల్‌ను వైడ్‌గా వేయడంతో 3 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. అయితే విరాట్ క్లీన్ బౌల్డ్ (bowld)అవ్వగా.. ఫ్రీహిట్ కావడంతో భారత బ్యాటర్లు 3 పరుగులు తీసుకున్నారు. దాంతో 2 బంతుల్లో 2 పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి దినేశ్ కార్తీక్ స్టంపౌట్ (Stump out)అయ్యాడు. ఆఖరి బంతిని వైడ్‌(wide)గా వేయడంతో మ్యాచ్ టై అయ్యింది. ఆఖరి బంతిని అశ్విన్ చాకచక్యంగా సింగిల్ (single)కొట్టడంతో భారత్ విజయం లాంఛనమైంది.

ఆనందంతో కోహ్లీని ఎత్తుకున్నరోహిత్: (Kohli picked up by Rohit)

చివరి బంతి వరకు వెళ్లిన ఈమ్యాచ్‌లో టీమ్ ఇండియా విజయాన్ని అందుకోగా.. కోహ్లి (kohli)ఎప్పటిలాగే తనదైన శైలిలో సంబరాలు (celebrations)చేసుకున్నాడు. పంచ్‌లతో (punch)నేలకొరిగి తన దూకుడును ప్రదర్శించాడు. అదే సమయంలో మైదానంలోకి (ground) వచ్చిన రోహిత్ (rohith)కోహ్లీని చూసి ఆగలేకపోయాడు. ముందుగా కోహ్లిని (hug)కౌగిలించుకుని ఆ తర్వాత భుజంపై ఎత్తుకున్నాడు. చిన్నపిల్లాడిలా కోహ్లిని భుజానికి వేసుకుని నడవడం (walking) మొదలుపెట్టాడు. మైదానంలో ఈ సీన్ చూసిన ఏ అభిమానైనా భావోద్వేగానికి (emotion)లోనవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు.  అతను తన స్టార్ ప్లేయర్‌ను మైదానంలోనే ఎత్తుకుని, గిరగిరా తిప్పేశాడు. విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ రోహిత్‌ శర్మతో విభేదాలు వచ్చినట్లు చాలాసార్లు వార్తలు వచ్చాయి. కానీ, మెల్‌బోర్న్‌ మైదానంలో కనిపించిన దృశ్యం వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయో లేదో కానీ టీమిండియా ఫ్యాన్స్‌ (fans)ఫుల్ ఖుష్ (happy) అవుతున్నారు.

Exit mobile version