ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతున్నాడు. ఐపీఎల్ సందర్భంగా తొడకండరాల బాధతో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్.. చివరి రెండు మ్యాచ్‌లాడాడు. ఫైనల్‌లో ముంబై తరఫున టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా, రోహిత్ ఆసీస్ పర్యటనకు ఎంపికవలేదు. అతడు కొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడని బీసీసీఐ పెద్దలు సూచించారు.
కాగా, భారత్.. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచులాడనుంది. కెప్టెన్ కోహ్లి ఒక్క టెస్టు మ్యాచ్‌కే అందుబాటులో ఉంటాడు. అనంతరం తను వెటర్నరీ సెలవుపై ఇండియాకు తిరిగిరానున్నాడు. ఆయన సతీమణి అనుష్కశర్మ జనవరిలో డెలవరీ కాబోతోంది. సో, కోహ్లి తన భార్యకు తోడుగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీనికి బీసీసీఐ నుంచి కూడా అనుమితి లభించింది. కోహ్లి గైర్హాజరీతో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించేందుకు రోహిత్‌ను టెస్టు సిరీస్‌కు ఎంపిక చేశారు.
దీంతో, రోహిత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ ట్రైనింగ్ ప్రారంభించాడు. రోహిత్ పూర్తి ఫిట్ గా కనిపిస్తున్నా.. బీసీసీఐ మాత్రం కాస్త సమయం కావాలంటుంది. ఎన్‌సీఏలో రాహుల్ ద్రావిడ్ సమక్షంలో హిట్‌మ్యాన్ సాధన చేస్తున్నాడు. పునరావాసం అనంతరం, రోహిత్, ఇషాంత్ శర్మ ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు. 14 రోజుల హోం క్వారంటైన్ తర్వాత వారు జట్టుతో కలువనున్నారు.