end

ఏఎస్‌ఐని దారుణంగా కొట్టి చంపిన రౌడీషీటర్‌

గొడవ చేయొద్దని రౌడీ షీటర్‌ను అడ్డుకున్నందుకు ఏకంగా ఏఎస్‌ఐని చంపేశాడు. ఈ దారుణమైన ఘటన చీరాల మండలం తోటవారిపాలెంలో జరిగింది. రౌడీషీటర్‌ సురేంద్ర మద్యం సేవించి, ఆ మత్తులో స్థానికంగా ఇళ్ల ముందు అనవసరంగా గొడవ చేశాడు. అయితే అక్కడే నివసిస్తున్న రిటైర్డ్‌ ఏఎస్‌ఐ సుద్దనగుంట నాగేశ్వరరావు రౌడీషీటర్‌ సురేంద్రను అడ్డుకొని వారించాడు. దీన్ని మనసులో పెట్టుకొని రాత్రి సమయంలో ఏఎస్‌ఐ ఇంట్లో చొరబడి నాగేశ్వరరావును కర్రతో తలమీద, ఒంటిమీద విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. (డీసీఎం వ్యాన్‌ కారు ఢీ…)

ఎఎస్‌ఐ మరణించిన సంగతి తెలియగానే రౌడీషీటర్‌ సురేంద్ర పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గొడవకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సురేంద్ర కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. (సినీ, టీవీ పరిశ్రమలకు స్వీట్‌ న్యూస్‌)

తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

ప్రకాశం బ్యారేజికి వరదపోటు – 70 గేట్లు ఎత్తివేత

Exit mobile version