end

రౌడీ షీటర్స్.. తస్మాత్ జాగ్రత్త

  • అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
  • వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్

వేములవాడ: పట్టణ పరిధిలోని రౌడీ షీటర్స్, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినమైన చర్యలు తప్పవని వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ హెచ్చరించారు. నేర చరిత్ర ఉంది కదా అని హద్దులు మీరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే జైలు ఊసలు లెక్కపెట్టక తప్పదని రౌడీ షీటర్స్‌కు సీఐ హెచ్చరికలు జారీజేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సంచలనాలు, పేరు కోసం అమాయక ప్రజలపై దాడులు చేస్తూ వివిధ కేసుల్లో శిక్షలు అనుభవిస్తున్న నేరగాళ్లు సత్ర్పవర్తన కలిగి ఉండాలని తెలియజేశారు.

ఇటీవల పిడియాక్ట్ లో జైలుకు వెళ్లిన పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేష్ గురించి ప్రస్థావిస్తూ రౌడీ షీటర్స్ కు జీవితం పట్ల అవగాహన కల్పించారు. గత అక్టోబరతర్‌లో వెంకటేష్ పై పీడీ యాక్ట్ ప్రపోసల్ పంపగా అతన్ని జైలుకు పంపించినట్లు తెలిపారు. ప్రస్తుతం జైలులో శిక్ష అనుభవిస్తున్న వెంకటేష్ తేది 5-12-2020 రోజున అడ్వైసరీ బోర్డుకు అభ్యర్థన పెట్టుకోగా తన నేర చరిత్రను పరిగణలోకి తీసుకొని బోర్డు అట్టి పిటిషన్ ను కొట్టివేస్తూ శిక్షను అలాగే కొనసాగించవల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చినట్లు వివరించారు. నేర ప్రవృత్తిని కలిగి వున్న వారిపై చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో గ్రహించాలని, ఎంతటి వారైనా సరే చట్టం నుండి తప్పించుకోలేరన్నారు.తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని, తస్మాత్ జాగ్రత్త అంటూ సీఐ వెంకటేష్ హెచ్చరికలు జారీ చేశారు.

Exit mobile version