196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్‌పై ఘనవిజయం సాధించింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్ సెంచరీతో చెలరేగాడు. మరో 10 బంతులు మిగిలుండగానే ఆర్ ఆర్ లక్ష్యాన్ని ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప(13 పరుగులు)ను పాటిన్సన్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్(11 పరుగులు) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు.
44 పరుగుల వద్ద స్మిత్ ఔట్ అయ్యాక.. స్టోక్స్‌కు, సంజూ సాంసన్(31 బంతుల్లో 54 పరుగులు; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడయ్యాడు. అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. ఇక ఓపెనర్ బెన్‌స్టోక్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 60 బంతులు ఎదుర్కొన్న స్టోక్స్.. 14 బౌండరీలు, 3 సిక్సర్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ముంబై బౌలర్లకు వీరిద్దరూ చుక్కలు చూపించారు. సెంచరీ భాగస్వామ్యంతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ముంబై బౌలర్లలో ప్యాటిన్సన్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి, 195 పరుగులు చేసింది.
పవర్‌స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్ ..
ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా(21 బంతుల్లో 60 పరుగులు; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 40 పరుగులు; 4ఫోర్లు, 1సిక్సర్), ఇషాన్ కిషన్(37 పరుగులు), సౌరభ్ తివారి(34 పరుగులు) రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. త్యాగి 1 వికెట్ తీశాడు. సెంచరీతో జట్టును గెలిపించిన స్టోక్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మొత్తానికి ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఫుల్‌గా అలరించింది.