end

RRR ఓటీటీలో 1000 మిలియన్ ..!

2021-22 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR థియేట్రికల్ గా రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2022లో 1000 కోట్ల క్లబ్ సినిమాగా రికార్డులు తిరగరాసింది. అంతకుమించి ఇప్పుడు ఓటీటీలో విశేష ఆదరణ దక్కించుకుంది. ఆ మేరకు టీమ్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రామ్ చరణ్ -జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా SS రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ RRR ప్రస్తుతం OTT ప్లాట్ ఫారమ్ ZEE5లో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతోంది.20 మే 2022న డిజిటల్ గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి భారీ స్పందనను అందుకుంటోంది.

ఈ చిత్రం అన్ని భాషలు కలుపుకుని కేవలం 10 రోజుల్లో 1000 మిలియన్ (1 బిలియన్) కంటే ఎక్కువ నిమిషాల వీక్షణలను అందుకుంది. ZEE5లో ఇటీవల విడుదలైన ఏ చిత్రం తో పోల్చినా ఇది అసాధారణమైన ఆదరణ. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్- అజయ్ దేవగన్- సముద్రఖని- ఒలివియా మోరిస్- శ్రియా శరణ్ తదితరులు నటించారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించింది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.RRR ఒక గొప్ప జనరంజకమైన వినోదాత్మక సినిమా అని అన్ని వేదికలపైనా ప్రూవ్ అయింది.

పెద్దతెరను డామినేట్ చేసేంతగా ఓటీటీ ఎదిగేస్తున్న క్రమంలో ఇక్కడా సంచలనంగా మారింది. లార్జర్ దేన్ లైఫ్ పాత్రలకు ఫిక్షన్ కథలకు విపరీతమైన ఆదరణ ఉంటుందనడానికి ఆర్.ఆర్.ఆర్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. ఈ లెస్సన్ బాలీవుడ్ తో పాటు అన్ని పరిశ్రమలకు మన జక్కన్న నేర్పించారన్న చర్చ సాగుతోంది. మునుముందు రాజమౌళి నుంచి ఇలాంటి పాన్ ఇండియా (వరల్డ్) సినిమాలు వస్తాయనడంలో సందేహం లేదు. తదుపరి మహేష్ ని అతడు పాన్ వరల్డ్ హీరోగా పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. మహేష్ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ తో పాటు ఓటీటీ రైట్స్ లో రికార్డ్ ధర పలకడం గ్యారెంటీ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు.

Exit mobile version