దేశవ్యాప్తంగా ఎంతగానో ఎదురుచూస్తున్న దర్శకధీరుడి ఆర్ఆర్ఆర్(రణం రౌద్రం రుధిరం) అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు చెక్ పెడుతూ రాజమౌళి టీమ్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 13వ తేదీన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలోనూ, ఎన్టీయార్ కొమురం భీమ్ పాత్రలోనూ కనిపించనున్నారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, టాప్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిగ్గజ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.