end

రూ. 58కే KG చికెన్

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ విస్తరిస్తోంది. దీంతో వివిధ జాతులకు చెందిన వేలాది పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ముఖ్యంగా చికెన్‌ ఉత్పత్తి చేసే కోళ్లు.. విచ్చలవిడిగా చచ్చిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. సాధారణంగా ఈ సీజన్‌లో చికెన్‌, గుడ్లకు విపరీతమైన డిమాండ్‌ ఉండేది. ఫ్లూ కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ నష్టాల్లో ఉంది. ఫ్లూతో చికెన్‌ ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. మహారాష్ట్రలో కేజీ చికెన్‌ ధర రూ. 58కి చేరగా.. గుజరాత్‌లో రూ. 65, తమిళనాడులో రూ. 70కి పడిపోయింది. వైరస్‌ మరింత విస్తరిస్తే.. చికెన్‌ ధరలు మరింత పతనమవుతాయని పౌల్ట్రీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఢిల్లీలో అయితే పౌల్ట్రీ పరిశ్రమపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. కాగా, ఫ్లూ లేని తెలంగాణలో మాత్రం చికెన్‌ ధరలు యాదావిధిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కేజీ చికెన్‌ రూ. 140 నుంచి రూ.180 వరకు పలుకుతున్నట్లు సమాచారం.

Exit mobile version