end

ఉక్రెయిన్‌ చిన్నారులను కిడ్నాప్‌ చేసిన రష్యా!

ukrain children kidnapped
ukrain children kidnapped

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రష్యా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఇప్పటికే సర్వం కోల్పోయిన ఉక్రెయిన్‌ రష్యా సైనికులకు ఎదురు నిలుస్తూ, ప్రతిఘటిస్తూ సైనికులు పోరాడుతున్నారు. ఉక్రెయిన్‌ ప్రజలు కూడా రష్యా దాడుల పట్ల నిరసనలు తెలుపుతున్నారు. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మనసు కరగడం లేదు. అసలు పుతిన్‌ ఉద్దేశ్యం ఏమిటో కూడా ప్రపంచ దేశాలకు అర్థం కావడం లేదు. కీవి నగరాన్ని సర్వనాశనం చేసినా కూడా పుతిన్‌కు కోపం తగ్గలేదు. అందుకే రష్యా ఆక్రమించిన డాన్‌బాస్‌ ప్రాంతంలో సుమారు రెండు వేల మంది చిన్నారులను రష్యా సైనికులు కిడ్నాప్‌ చేశారని ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది.

(దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు)

సుమారుగా 2,389 మంది ఉక్రెయిన్‌ దేశ చిన్నారులను రష్యా కిడ్నాప్‌ చేసినట్లు పేర్కొంది. చట్టవిరుద్ధంగా తమ దేశ చిన్నారులను అపహరించినట్లు వాపోయింది. ఇదేగాకుండా ఓడరేవు నగరమైన మారియుపోల్‌ను రష్యా సైనికులు చుట్టుముట్టి ఉక్రెయిన్‌ బలగాలను లొంగిపోవాలని డిమాండ్‌ చేశారు. కానీ ఉక్రెయిన్‌ అధికారులు ప్రతిఘటిస్తున్నారు. రష్యా బలగాలను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అతిదారుణమైన విషయం ఏంటంటే మారియుపోల్‌లో తలదాచుకున్న ఆర్ట్‌ స్కూల్‌పై రష్యా దారుణంగా బాంబులు వేసింది. సుమారు 400 మంది పౌరులు, చిన్నారులు అందులో తలదాచుకున్నారు. అయితే కేవలం 150 మందిని మాత్రమే ఉక్రెయిన్‌ సైనికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని సైనిక అధికారులు వెల్లడించారు.

హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కారు బ్లాక్‌ స్ర్కీన్‌ తొలగింపు

Exit mobile version