రష్యాలో విమానం గల్లతైంది. దాదాపు 22 మంది ప్రయాణీకులతో ఉన్న విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయి ఎటు వెళ్లిందో తెలియడం లేదు. షెడ్యూల్ ప్రకారం పట్రోపవ్లోస్క్ కామ్‌చట్‌స్కీ నుండి పలానా వెళ్తున్న విమానం ల్యాండింగ్ జరగలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విమానంలో 22 మంది ప్రయాణీకులు, ఆరు మంది సిబ్బంది, కొంత మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విమానం సముద్రంలో పడిపోయిందా లేక అడవుల్లో, కొండల్లో కూలిపోయిందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పలానా పట్టణం సమీపంలోని బొగ్గు గని ప్రాంతంలో కూలిపోయి ఉండవచ్చునని స్థానికంగా చర్చించుకుంటున్నారు. విమానం ఆచూకీ కోసం హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు సహాయక సిబ్బంది.
ఇవి కూడా చదవండి…