సినీ నటులంతా(Cinema stars) దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చూస్తారు. ముఖ్యంగా ఈ విషయంలో హీరోయిన్లు (Heroines) ముందు వరుసలో ఉంటారు. కానీ, సమంత(Samantha) దీనికి అతీతం అనే చెప్పాలి. ఔను ఆమె ఆరోగ్యం, ప్రశాంతతకు ప్రాధాన్యమిస్తోంది. నచ్చితేనే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మెంటల్ హెల్త్, అడ్వర్టయిజ్‌మెంట్స్‌పై చర్చిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తాను కొన్ని కోట్ల విలువ చేసే యాడ్స్ వదులుకున్నట్టు తెలిపింది. దీనికి సమంత చెప్పిన కారణం వింటే ఆమెపై గౌరవం రెట్టింపు కాక తప్పుదు. ‘ఇరవై ఏళ్ల వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. అప్పట్లో విజయానికి నిర్వచనం మరోలా ఉండేది. మనం ఎన్ని ప్రాజెక్టులు చేశాం.. ఎన్ని బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నామనేదానిపైనే మన సక్సెస్‌ను లెక్కగట్టేవారు. ఆ సమయంలో నేను ఎన్నో మల్టీనేషనల్ బ్రాండ్స్(Multi national brands)కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం నాకు గొప్పగా అనిపించేది. ఆనందాన్నిచ్చేది కూడా. కానీ ప్రస్తుతం చాలా విషయాలపై నాకు అవగాహన వచ్చింది. ఉత్పత్తులను ప్రమోట్ చేసేటప్పుడు బాధ్యతగా ఉండాలని తెలుసుకున్నా. ఆ తర్వాత ఏ బ్రాండ్‌కు పడితే దానికి అంబాసిడర్‌గా ఉన్నందుకు నాకు నేనే క్షమాపణ చెప్పుకున్నా. కోట్లలో డబ్బు ఇస్తానని వచ్చినప్పటికీ గడిచిన ఏడాదిలోనే సుమారు 15 బ్రాండ్స్ వదులుకున్నా. నా వద్దకు వచ్చే ఉత్సత్తులను తెలిసిన వైద్యులతో పరిశీలింపజేసి.. వాటి కారణంగా సమాజానికి ఎలాంటి హాని కలగదని నిర్ధారించుకున్న మీదటే ఆ యాడ్‌ను అంగీకరిస్తున్నా’ అని సమంత చెప్పుకొచ్చింది.