ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు సేమ్యా తో సులభంగా అదిరిపోయే(Delicious) సేమ్యా ఉప్మా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఇందులో వెరైటీ ఉప్మా(Variety Upma) సేమ్యా ఉప్మా..ఇది బ్రేక్ ఫాస్ట్(Breakfast) గా మాత్రమే కాకుండా..ఈవెనింగ్ స్నాక్(Snack) గా కూడా తినోచ్చు.ఇది చిన్న పిల్లలు కారం కొంచం తక్కువ వేస్తే చాలా ఇష్టంగా తింటారు.
తయారుచేయు విధానం:
ముందుగా పాన్ వేడి చేసి అందులో నెయ్యి(Ghee)(నెయ్యి కి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు) వేసి లైట్ గా కాగిన తర్వాత అందులో సేమ్యా వేసి గోల్డ్ బ్రౌన్ కలర్(Golden Brown Color) వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత వేరే ప్లేట్ లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, శెనగపప్పు, కరివేపాకు వేసి వేగించుకోవాలి.తర్వాత అందులోనే ఉల్లిపాయలు(Onions) కూడా వేసి మీద వేగించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, క్యారెట్, గ్రీన్ పీస్, పచ్చిమిర్చి మరియు టమోటో ముక్కలు కూడా వేసి టొమోటో(Tomato) మెత్తగా అయ్యేదాకా వేగించుకోవాలి.మొత్తం మిశ్రమం వేగిన తర్వాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టుకొన్న సేమ్యా, ఉప్పు, మరియు నీళ్ళు పోసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నెయ్యి తో వేగించుకున్నాం కాబట్టి ఉండలుగా కట్టవు. తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. సేమ్యా మెత్తగా ఉడికిన తర్వాత మూత తీసి నీరు మొత్తం పూర్తిగా పోయే వరకూ సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. నీరు మొత్తం డ్రై అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.ఇష్టం ఉన్నవాళ్ళు కొత్తిమీర తో గార్నిష్(Garnish) చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.