end

Sangeet Natak Academy Awards:సంగీత నాటక అకాడమీ అవార్డులు

  • 2019, 2020, 2021 ఏడాదికిగాను వీరిని ఎంపిక చేసినట్లు అకాడమీ వెల్లడించింది.
  • ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులకు 128 మంది కళాకారులు ఎంపికయ్యారు.
  • 10 మంది ప్రముఖులకు ఫెలోషిప్ అందజేయనున్నట్లు కూడా తెలిపింది.
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఇటీవల వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను దక్కించుకున్న తెలంగాణ (Telangana) రాష్ర్ట పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి.
  • ఫాస్ట్ మూవర్ సిటీ 3నుంచి 10 లక్షల జనాభా విభాగంలో వరంగల్ (Warangal) నగరపాలక సంస్థ 3వ స్థానంలో నిలిచింది.
  • 50 వేల నుంచి లక్ష జనాభా విభాగంలో కాకజ్ నగర్(Kagaz nagar) పురపాలక సంస్థ
  • జనగాం (Janagam) మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
  • 25 నుంచి 50 వేల జనాభా విభాగంలో అమనగల్ (AMANGAL) నిలిచింది.
  • 15 నుంచి 25 వేల జనాభా విభాగంలో గుండ్లపోచంపల్లి (Gundlapochampally)రెండో స్థానం, కొత్త కోట మూడో స్థానంలో ఉంది.
    15 వేలలోపు జనాభా విభాగంలో వర్దన్న పేట (Wardhannapet) (రెండో స్థానం) అవార్డులను దక్కించుకున్నాయి.

స్వాతి బలరామ్‌కు లోక్ నాయక్ (Lok Nayak to Swati Balaram) సాహిత్య పురస్కారం:

  • లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాదికి స్వాతి వ్యవస్థాపక సంపాదకుడు వేమూరి బలరామ్ కు ప్రదానం చేయనున్నట్లు లోక్ నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు.
  • జనవరి 18న ఈ పురస్కారం అందించనున్నారు.

తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) కి శ్రీసత్యసాయి అవార్డ్:

  • విద్య, ఆరోగ్యం, శిశు సంక్షేమం తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఏడుగురు మహిళలకు శ్రీ సత్యసాయి అవార్డ్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (Sri Sathya Sai Award for Human Excellence) పురస్కారాలను అందజేశారు. కర్ణాటకలోని చక్కబళ్లాపుర సమీప ముద్దేనహళ్లిలో (At Muddenahalli near Chikkaballapur in Karnataka) నిర్వహించిన కార్యక్రమంలో సద్గురు మధుసూదన్ సాయి పురస్కారాలను (Sadhguru Madhusudan Sai Awards)అందించారు.
  • తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ నీర్జా బిర్లా, దివ్యాంగ క్రీడాకారిణి మాలతి హొళ్లా, ఒడిశాకు చెందిన డాక్టర్ తులసీ ముండా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కౌశల్య బాయి, తమిళనాడుకు చెందిన ఆర్. రంగమ్మాళ్, న్యాయవాది గౌరీ కుమారి (Lieutenant Governor of Puducherry Dr. Neerja Birla, disabled athlete Malathi Holla, Odisha’s Dr. Tulsi Munda, Chhattisgarh’s Kaushalya Bai, Tamil Nadu’s R. Rangammal, Advocate Gauri Kumari) పురస్కారాలు అందుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు 5 స్కోచ్ అవార్డులు: (5 Scotch Awards for Andhra Pradesh)

  • గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికి ఐదు స్కోచ్ (Scotch Awards) అవార్డులు లభించాయి. పొదపు సంఘాలకు బ్యాంకు రుణాలకు సంబంధించి రెండు బంగారు, మూడు రజత అవార్డులు దక్కాయి.

డా.పూర్ణిమా దేవికి ఐరాస పర్యావరణ అవార్డు: (UN Environment Award to Dr. Purnima Devi)

  • భారత వన్యప్రాణి జీవశాస్ర్తవేత్త (A wildlife biologist)డా. పూర్ణిమాదేవి బర్మన్‌ను ఈ ఏడాది ఐరాస ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ (United Nations Champions of the Earth) అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ వ్యవస్థ క్షీణతను నిరోధించడానికి కృషి చేస్తున్న వారికి ఇది ఐరాస ఇచ్చే అత్యుత్తమ గౌరవ పురస్కారం.
  • అస్సాంకు చెందిన పూర్ణిమాదేవి అవిఫౌనా రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ డివిజన్ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్‌ (Senior Project Manager, Avifauna Research and Conservation Division)గా పని చేస్తున్నారు. 10 వేల మంది మహిళలతో ఈమె నిర్వహిస్తున్న హర్గిలా ఆర్మీ గ్రేటర్ ఎడ్జుటెంట్ స్టార్క్ (Hargila Army Greater Adjutant Stark) అనే ప్రత్యేక కొంగల జాతి అంతరించిపోకుండా వాటి సంరక్షణకు కృషి చేస్తోంది.

పీఆర్‌సిఐ హైదరాబాద్ చాప్టర్‌కు పురస్కారాలు: (Awards for PRCI Hyderabad Chapter)

  • భారతీయ ప్రజా సంబంధాల మండలి (పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా – పీఆర్‌సీఐ PRCI) ఇటీవల కోల్‌కతా (Kolkata)లో నిర్వహించిన గ్లోబల్ సదస్సు (Global conference) లో తెలంగాణకు చెందిన హైదరాబాద్ చాప్టర్, సభ్యులు ఆరు పురస్కారాలను పొందారు.
  • జాతీయ స్థాయిలో అత్యుత్తమ చాప్టర్, ఉత్తమ ప్రచార రూపకల్పనతో పాటు ఫ్రెడ్రిక్ మైఖేల్, ప్రకాశ్ జైన్‌లకు రెండు హాల్ ఆఫ్ ఫేమ్ (Two Hall of Fame for Frederick Michael and Prakash Jain) పురస్కారాలు, జాతీయ స్థాయిలో ఉత్తమ మాడరేటర్‌గా సారా వరద, డిజిటల్ మార్కెటింగ్‌లో మతి మిటాలీ అగర్వాల్ (Sara Varada as Moderator, Mathi Mitali Aggarwal on Digital Marketing) పురస్కారాలు అందుకున్నారు.

(Librarian Posts:KVSలో 13,404 TGT, PGT, లైబ్రేరియన్ పోస్టులు)

Exit mobile version