బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్(Varun Dhawan) తన ఫస్ట్ క్రష్‌పై ఓపెన్ అయ్యాడు. త్వరలోనే ‘భేదియా’తో ప్రేక్షకుల ముందుకు రానున్న హీరో తన సినిమాను వీపరీతంగా ప్రమోట్ చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజా ఇంటరాక్షన్‌లో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza)పై ప్రేమను కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. తను మొదటిసారి ఓ ప్రొడక్షన్ హౌజ్ చిత్రీకరించిన ప్రకటనలో నటించేందుకు ఒప్పందం చేసుకున్నానని, అయితే అదే యాడ్‌లో సానియా మీర్జాకూడా ఉందనే విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ షూటింగ్(Shooting) ముగిసేలోపు చాలాసార్లు సానియాను చూస్తూ ఉండిపోయానన్న హీరో సానియా తల్లి నసిమా మీర్జా(Nasima Mirza)తో ఎదుర్కొన్న ఓ ఇబ్బందిరకమైన సంఘటన గుర్తుచేసుకున్నాడు. ‘ఈ షూట్‌లో ఉన్నపుడు ఒకసారి సానియా తినడానికి ఆపిల్స్ కావాలని నన్ను అడిగింది.
వెంటనే బయటకెళ్లి తీసుకుని తిరిగొస్తుండగా సానియా తల్లి నన్ను ఆపి పలు ప్రశ్నలు వేసింది. చివరగా ఈ ఆపిల్స్(Apples) సానియా కోసమని చెప్పాను. కానీ, ఆమెను మేడమ్ అని పిలవలేదు ఎందుకంటే సానియాపై విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి. దీంతో ఆమె కోపంతో ‘సానియా ఆపిల్స్ తినదు’ అని మొహంమీదే గంభీరంగా చెప్పింది. నేను కాస్తం ఆందోళన చెందాను. వెంటనే సానియా వచ్చి తనకోసమే తెమ్మన్నానని చెప్పి నన్ను ఆమె నుంచి కాపాడింది’ అంటూ సరదాగా(Happy) చెప్పుకొచ్చాడు. చివరగా ఆ ప్రకటన(Add) కోసం రూ. 5వేలు అందుకున్నట్లు వెల్లడించాడు వరుణ్.