end
=
Wednesday, January 22, 2025
వార్తలురాష్ట్రీయంసంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు
- Advertisment -

సంజయ్‌కు రాజకీయ పరిజ్ఞానం లేదు

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజకీయాల పట్ల కనీస పరిజ్ఞానం లేదని టీపీసీసీ ఛైర్మన్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ దొంగ నాటకాలు అడుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉత్తమ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎంపికకు సీఎం కేసీఆర్ మద్దతు పలికారా.. లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఒకరికొకరు మద్దతిచ్చుకుంటూనే.. ఇరు పార్టీలు పైపై విమర్శలు చేసుకుంటున్నాయని తెలిపిన ఆయన.. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు.

ఇవన్నీ చూస్తే బండి సంజయ్‌కు రాజకీయ అవగాహన లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. కరీంనగర్‌లో చిల్లర కార్పొరేటర్‌గా గెలిచి, అదృష్టావశాత్తు ఎంపీ అయిన ఆయన ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. బండి సంజయ్‌కు హైదరాబాద్ ఎక్కడుందో కూడా సరిగా తెలియదన్నారు. అలాంటి వ్యక్తికి పార్టీ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఇలాగే ఉంటుందని ఉత్తమ్ కుమార్‌ విమర్శించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -