‘సేక్రేడ్ గేమ్స్’ ఫేమ్ ఎల్నాజ్ నొరౌజీ ఇరాన్(Iran)లో నెలకొన్ని సంక్షోభ పరిస్థితులపై స్పందించింది. మషా అమిని మరణం తర్వాత హింసాత్మక(Violent) నిరసనలను ఎదుర్కొంటున్న దేశంలో చిక్కుకున్న తన కుటుంబం కోసం ఆందోళనగా ఉందని చెప్పింది. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడుతూ ఇరాన్‌లో జరుగుతున్న మానవ హక్కుల(Human Rights) ఉల్లంఘన గురించి మాట్లాడటం ఇప్పుడు చాలాముఖ్యమన్న నటి.. అక్కడ ఏ జరుగుతుందో బయటి ప్రజలకు తెలియకుండా, ఎవరినీ కమ్యూనికేట్ చేయకుండా ఇంటర్నెట్(Internet)ను కట్ చేసినట్లు తెలిపింది. దీంతో తన కుటుంబంతో ఏ రకమైన కమ్యూనికేషన్ లేదని, ప్రతి మార్గం బ్లాక్ చేయబడిందంటూ ఎమోషనల్ అయింది.
(One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?)
ఈ సమయంలో మనందరీ వాయిస్ పెంచి అక్కడి పిరిస్థితులను ప్రపంచం(World) దృష్టికి తీసుకొస్తేనే ఏదైనా మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని అభిమానులను కోరింది. ఇక మూడు రోజులుగా తనవాళ్లతో మాట్లాడలేదన్న ఎల్నాజ్.. తనుకు ప్రస్తుతం కన్నీళ్లు మాత్రమే మిగిలాయని, ఆ దేశానికి సంబంధించిన ఏ వీడియో చూసిన దు:ఖం తన్నుకొస్తుందని వాపోయింది. చివరగా తొందరలోనే మంచి రోజులు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల మషా అమిని అనే 22 ఏళ్ల అమ్మాయి హిజాబ్ సరిగా ధరించలేదని, దీంతో తమ మత ఆచారాల(Religious Rituals)ను కించపరిచిందంటూ పోలీసులు ఆరెస్ట్ చేయగా లాకప్‌లోనే ఆమె మరణించింది. అయితే ఆమె తల, ఒంటిపై గాయలుండటంతో కొట్టి చంపేశారంటూ ప్రజలు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపట్టారు.
(Forest Walk :అడవిలో 60 నిమిషాలు నడిస్తే మెదడులో అద్భుతం)