end

Delhi Metro:మెట్రోలో అదరగొట్టిన స్కూల్ విద్యార్థులు

  • తెగ వైరల్ అవుతున్న వీడియో
  • కేజ్రీవాల్‌పై నెటిజన్ల ప్రశంసల వర్షం


పంజాబీకి చెందిన స్టార్ సింగర్ బి ప్రాక్(Star Singer B Proc) అందించిన ‘మన్ భర్య’ సాంగ్ విడుదలైనప్పటినుంచి అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. కొంతకాలంగా ఎక్కడ చూసిన ప్రజలు ఇదే పాట పాడుతూ కనిపిస్తున్నారు. అంతేకాదు ఈ పాటకు డబ్బింగ్ వీడియోలు(Dubbing Video), రీల్స్ చేస్తూ నెటిజన్లు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ అందమైన పాటను ఢిల్లీ మెట్రో(Delhi Metro)లో ప్రయాణిస్తున్న ముగ్గురు పాఠశాల విద్యార్థులు పాడుతూ గిటారు(Guitar) వాయించిన తీరు ప్రయాణికులతోపాటు వీక్షకులను మంత్రముగ్దుల్నీ చేస్తోంది.

ప్రస్తుతం ఊహించని రీతిలో ఈ వీడియో వైరల్(Video Viral) అవుతుండగా స్కూల్ యూనిఫాంలోవున్న ఆ ముగ్గురు ‘స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్‌’కి చెందిన విద్యార్థులుగా తెలుస్తోంది. అలాగే చేతిలో బుక్స్ బ్యాగ్‌లతోనే ప్రయాణిస్తున్న బాలల ప్రతిభకు సంబంధించిన వీడియోను డిజిటల్ కంటెంట్ సృష్టికర్త హర్ష్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. ‘నిన్న మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు పింక్ లైన్ మెట్రోలో ప్రత్యక్ష ప్రదర్శన చేస్తున్న ఈ సూపర్ టాలెంటెడ్(Super Talented) పిల్లలను చూశాను. నేను చూసిన అత్యుత్తమ ప్రత్యక్ష ప్రదర్శన. మీరు కూడా ఆనందించినట్లయితే.. నిజమైన ప్రతిభను అభినందిస్తే కామెంట్ బాక్స్‌(Comment Box)లో హృదయ స్పందనను వదలండి’ అంటూ తనదైన స్టైల్‌లో పొగిడేశాడు.

ఈ వీడియో సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసిన 24 గంటల్లోనే 1.4 లక్షల కంటే ఎక్కువ వీక్షణలను పొందడంతోపాటు దాదాపు 23,000 లైక్‌లను కూడా సొంతం చేసుకుంది. ‘నిజంగా ఇది అద్భుతం. వారు గొప్ప ప్రతిభావంతులు. విద్యార్థులను ఇలా చూడటం చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి కళాకారులకు మద్దతు ఇస్తున్నందుకు కేజ్రీవాల్‌కి ధన్యవాదాలు’ అంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

https://www.instagram.com/reel/Cld0Kf5AKcz/?utm_source=ig_web_copy_link

(Leukemia:ప్రపంచలోనే మొదటి సారి)

Exit mobile version