end
=
Saturday, January 18, 2025
విద్యా సమాచారంనవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్‌
- Advertisment -

నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్‌

- Advertisment -
- Advertisment -

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం..

వచ్చే నెల రెండో తారీఖు నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈ విషయమై ఇవాళ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన మహమ్మారి జబ్బు.. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రంలో స్కూళ్లు తెరుచుకోలేదు.

ప్రజలు ఇంకా అప్రమత్తంగా ఉండాలిః ప్రధాని

విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తప్పలేదని సీఎం తెలిపారు. అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాతే పాఠశాలలు రీ ఓపెన్‌ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.కాగా, స్కూళ్లు రీ ఓపెన్ అయినా ఒక్కపూట బడులు మాత్రమే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. దీంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు మధ్యాహ్యం వరకే పనిచేస్తాయనీ.. అనంతరం మధ్యాహ్న భోజనం అందించి, విద్యార్థులను ఇంటికి పంపిస్తామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు.

ముంపు బాధితులకు రూ.10వేల తక్షణ సహాయం

రెండు రోజులకొకసారి మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒకరోజు, 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరోరోజు క్లాసులు జరగనున్నాయి. విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకొకసారి తరగతులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని సూచించారు. పాఠశాలల వేళలపై పరిస్థితిని బట్టి డిసెంబర్‌ నెలలో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు.

నిషేధిత గుట్కా ప్యాకెట్లు సీజ్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -