Schools Reopen : ఏపీ(Andhrapradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాలలో పాఠశాలలు (Schools starts) పునఃప్రారంభమయ్యాయి. దాదాపు 45 రోజులపాటు వేసవి సెలవుల(Summer Holidays) అనంతరం జూన్ 12న (June 12) ప్రభుత్వ (Governement Schools), ప్రైవేటు పాఠశాలలు (Private Schools), కళాశాలలు(Colleges) ప్రారంభయ్యాయి. విద్యార్థులు బడిబాట(Badibata) పట్టారు. అయితే వేసవి ఎండ తీవ్రతలు ఇంకా తగ్గకపోవడంతో వారం రోజులపాటు ఒంటిపూట (Half Day Class) బడులు నిర్వహించాలని ఆయా ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణ ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నారు. జూన్ 13న తొలిమెట్టు, జూన్ 14న సామూహిక అక్షరాభ్యాసం, జూన్ 15న ప్రత్యేక కార్యక్రమాలు, జూన్ 16న ఆంగ్ల మాధ్యమం, జూన్ 17న కేరీర్ గైడెన్స్, జూన్ 19న గ్రీన్ ఫెస్టివల్, జూన్ 20న విద్యా దినోత్సవం నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వేసవి సెలవులు పొడగింపు లేదు
ఇదిలావుండగా తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించారని సోషల్ మీడియా(Social Media)లో వస్తున్న వార్తలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియా (వాట్సాప్, ఫేస్‌బుక్)లో వైరల్ అవుతున్న నకిలీ ఉత్తర్వులు(Fake Orders) నమ్మొద్దని విద్యాశాఖ(Education) అధికారులు స్పష్టం చేశారు. పాఠశాలలకు వేసవి సెలవుల పొడిగింపు లేదని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం (12వ తేదీ) నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పేర్కొన్నారు.