end
=
Sunday, February 23, 2025
వార్తలురాష్ట్రీయంఫిబ్రవరి నుంచి స్కూళ్లు ప్రారంభం..
- Advertisment -

ఫిబ్రవరి నుంచి స్కూళ్లు ప్రారంభం..

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఫిబ్రవరి నుంచి స్కూళ్లు పునఃప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9వ తరగతి ఆపై తరగతులను నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రగతి భవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సోమవారం సమావేశమైన ముఖ్యమంత్రి.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రెవెన్యూకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. కరోనా వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అన్ని శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలన్నారు. అన్ని పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -