end
=
Wednesday, November 20, 2024
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీAnts: చీమల సంఖ్యను లెక్కించిన శాస్త్రవేత్తలు.. ఎలాగో తెలుసా?
- Advertisment -

Ants: చీమల సంఖ్యను లెక్కించిన శాస్త్రవేత్తలు.. ఎలాగో తెలుసా?

- Advertisment -
- Advertisment -

ఈ భూమిపై ఎన్ని చీమలు నివసిస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా ఇలాంటి ఆలోచనలు రావడం అసాధ్యం. కానీ, ఇది ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే మనుషులతోపాటు మనుగడ సాగిస్తున్న ప్రాణుల్లో 70 శాతానికిపైగా లెక్కలున్నప్పటికీ అతిచిన్న జీవుల లెక్కింపు కూడా అవసరం అని చెబుతున్న శాస్త్రవేత్తలు.. ఇటీవల చీమల మొత్తం సంఖ్యను లెక్కించి ఆశ్చర్యపరిచారు. ఏ సమయంలోనైనా భూమిపై దాదాపు 20 క్వాడ్రిలియన్ (Quadrillion) అంటే ఇరవైవేల మిలియన్ మిలియన్లు(దాదాపు 20,000,000,000,000,000) చీమలు ఉంటాయని ఇటీవల అధికారికంగా వెల్లడించగా ఈ వార్త విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.

అయితే నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో (Proceedings of the National Academy of Sciences)  ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం మునుపటి కంటే ప్రస్తుతం 20 రెట్లు ఎక్కువ చీమలు ఉన్నట్లు అంచనా వేసింది. ఈ అధ్యయనం చాలా అనుభావిక అధ్యయనాల నుంచి డేటాను (Data) సంశ్లేషణ చేసిందని అధ్యయన సహ రచయిత (WRITER) సబీన్ S. నూటెన్ (S. nuten) తెలిపారు. గతంలో ప్రపంచవ్యాప్తంగా చీమల సంఖ్య 1 క్వాడ్రిలియన్ నుంచి 10 క్వాడ్రిలియన్ మధ్య ఉండవచ్చని జీవశాస్త్రవేత్తలు బెర్ట్ హోల్‌డోబ్లెర్, ఎడ్వర్డ్ ఓ. విల్సన్ (Bert Holldobler, Edward O. Wilson) నిర్ధారించారు. ప్రపంచంలోని మొత్తం కీటకాల జనాభాలో చీమలు 1% ఉన్నాయని ఈ స్థానం భావించింది. అయితే కొత్త అధ్యయన పరిశోధనా బృందం ప్రపంచవ్యాప్త డేటా నుంచి పరిశీలనాత్మక సాక్ష్యాలను ఉపయోగించింది. 1,306 నమూనా స్థానాలు కలిగిన 465 అధ్యయనాలను విశ్లేషించింది. అంటే చీమలు నివసించే అన్ని ప్రదేశాలను లెక్కించడం.

భవిష్యత్ వాతావరణాలు ఎలా ఉండవచ్చో అంచనా వేయడానికి అధ్యయనానికి సంబంధించిన సమగ్రమైన డేటా సెట్‌ను 80 సంవత్సరాలుగా (80 Years) పరిశీలిస్తున్నారు. సంఖ్య భారీగా ఉన్నప్పటికీ అధ్యయన రచయితలు అంచనాను ‘కన్జర్వేటివ్’గా (Conservative) పిలిచారు. అయితే ఇక్కడ శాస్త్రవేత్తలు తమకు అవసరమైన మొత్తం డేటాను సేకరించలేదు. ఉదాహరణకు భూగర్భంలో నివసించే చీమలు ఈ అధ్యయనం కోసం లెక్కించబడలేదు. ఎందుకంటే వాటికి సంబంధించిన డేటా లేదని తెలిపారు.

(దసరా సెలవులు.. వచ్చేస్తున్నాయి….  )

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -