end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయంసీనియర్‌ నటుడు బాలయ్య మృతి
- Advertisment -

సీనియర్‌ నటుడు బాలయ్య మృతి

- Advertisment -
- Advertisment -

తెలుగు సినీమా ప్రముఖ సీనియర్‌ నటుడు బాలయ్య (94) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బాలయ్య పూర్తిపేరు మన్నవ బాలయ్య. గుంటూరు జిల్లాలోని వైకుంఠపురంలో 1930, ఏప్రిల్‌ 9న జన్మించారు. ఇదే విచిత్రం… పుట్టిన తేదీ నాడే మరణించడం. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో తన నివాసంలో ఆయన మరణించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలందించారు. 300 సినామాలకుపైగా నటించారు. ఎత్తుకు పై ఎత్తు సినీమాతో బాలయ్య నటుడిగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు.

కుంకురేఖ, భాగ్యదేవత, ఇరుగు పొరుగు, బొబ్బిలియుద్ధం, పాండవవనవాసము, శ్రీకృష్ణపాండవీయం వంటి చిత్రాలు చాలా గుర్తింపునిచ్చాయి. ఇవేగాకుండా పలు చిత్రాలకు దర్శకత్వము వహించారు. అల్లూరి సీతారామరాజు చిత్రంలో అగ్గిరాజు పాత్ర పోషించి, మెప్పించాడు. ‘ఈ నాటి బంధం ఏ నాటిదో’, ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ వంటి చిత్రాలు నిర్మించారు .బాలయ్య ‘శ్రీరామరాజ్యం’లో వశిష్టుని పాత్రలో కనిపించారు. బాలయ్య మృతిపట్ల తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -