end

Mumbai:ముంబై విమానాశ్రయంలో సర్వర్ డౌన్

  • కొన్ని గంటల పాటు నిలిచిపోయిన సేవలు
  • ప్రయాణీకులతో రద్దీగా మారిన ఎయిర్ పోర్టు


ముంబై (Mumbai) విమానశ్రయంలో సర్వర్ (Server failure) వైఫల్యం ప్రయాణాలపై (Passengers) తీవ్ర ప్రభావం చూపింది. దీంతో షెడ్యూల్ ప్రయాణాలు వాయిదా పడటంతో ప్రయాణీకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానశ్రయం (Chhatrapati Shivaji Maharaj International Airport) లో కొన్ని గంటల పాటు పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వర్లు మోరాయించడంతో ప్రయాణీకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. చెక్‌ఇన్ (check in) సమస్యలు తలెత్తి విమానాలు ఆలస్యమయ్యాయి.

అయితే ఈ సమస్యపై వెంటనే స్పందించిన స్పందించిన ఎయిర్ పోర్టు (Airport) నిర్వహణ సిబ్బంది ప్రయాణీకులకు క్షమాపణ కోరుతూ ప్రకటన చేశారు. చెక్‌ఇన్ అవడానికి అదనపు సమయం కేటాయించాలని కోరింది. సంబంధిత ఎయిర్‌లైన్స్‌ (Airlines) తో దయచేసి కనెక్ట్ అవ్వాలని పేర్కొంది. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంపై ప్రయాణీకులు ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 90 నిమిషాల పాటు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. విమానంలో గంట పాటు ఖాళీగా కూర్చున్నాం. టేకాఫ్ (take off) సమయంపై ఎలాంటి ప్రకటన లేదు. ముంబై ఎయిర్ పోర్టులో ఆందోళన పరిస్థితులు ఉన్నాయి అని మరో ప్రయాణీకుడు ట్వీట్ (Tweet) చేశాడు.

చివరికి ఎయిర్ పోర్టు సిబ్బంది మాన్యువల్ (Manual) పద్దతిలో ప్రయాణీకులను అనుమతించింది. ప్రయాణీకుల అసౌకర్యానికి చింతిస్తున్నామని, సమస్యను అర్థం చేసుకున్నందుకు ధన్యావాదాలు తెలిపింది. అయితే కేబుల్ కట్ (Cable cut) కావడం వల్లే సమస్య తలెత్తిందని ఎయిర్ పోర్టు అథారిటీ ట్వీట్ చేసింది. తిరిగి అన్ని యథాస్థితికి వచ్చాయని పేర్కొంది. అయితే ప్రయాణీకులతో రద్దీగా మార్కెట్‌ను తలపించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ (Photos and videos are viral)గా మారాయి.

(Old City:పాత బస్తీలో దారుణం)

Exit mobile version