end

పెళ్లికి ముందు సెక్స్ నేరం

  • అతిక్రమిస్తే ఇండోనేషియాలో ఏడాది జైలు శిక్ష
  • క్రిమినల్ కోడ్ అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడి


పెళ్లికి ముందు శృంగారాన్ని నియంత్రించేందుకు ఇండోనేషియా ప్రభుత్వం (Indonesian Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లి కాకముందు సెక్స్ చేస్తే ఏడాది జైలు శిక్ష (Sex before marriage is punishable by one year imprisonment) విధించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించిన క్రిమినల్ కోడ్‌ (Criminal Code) ను త్వరలోనే తీసుకురానున్నట్లు స్థానిక కథనాలు పేర్కొన్నారు. ‘భర్త లేదా భార్య కాని వారితో ఎవరైనా శృంగారం చేసినందుకు గరిష్టంగా ఏడాది జైలు శిక్ష లేదా గరిష్ట జరిమానా విధించబడుతుంది’ అని అర్టికల్ (Article) 413 చెబుతుంది. అయితే వివాహేతర సంబంధం (extramarital affair) లేని వారి పిల్లల తల్లిదండ్రుల నుంచి లేదా వ్యభిచారానికి పాల్పడిన వారిపై భర్త లేదా భార్య నుంచి ఫిర్యాదు వస్తే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొంది. కోర్టు ట్రయల్ మొదలయ్యే లోపు ఫిర్యాదు వెనక్కి తీసుకునే వెసులుబాటు కల్పించింది.

అయితే ఇండోనేషియా విలువలను పెంపొందించే ఇలాంటి నిర్ణయాలు తీసుకోనుండడం తమకు గర్వకారణమని న్యాయ శాఖ సహాయ మంత్రి ఎడ్వర్డ్ ఓమర్ (Minister of State for Justice Edward Omar) పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో (sessions of Parliament) ఈ క్రిమినల్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల కిందటే దీనిని అమలు చేయాల్సి ఉండగా, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకావడంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఇన్నాళ్లకు మళ్లీ ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది ఇండోనేషియా.

‘ఎవరైనా సరే తన భర్త లేదా తన భార్యతో కాకుండా వేరేవారితో సంగమిస్తే దాన్ని నేరంగా పరిగణించి గరిష్టంగా ఒక ఏడాది జైలు శిక్ష పడుతుంది. లేదా కేటరిగీ 2 (Category ) ప్రకారం గరిష్ట జరిమానాలు ఉంటాయి’ అని ఆ కథనం తెలిపింది. కానీ, అందుకు భార్య లేదా భర్త నుంచి లేదంటే పెళ్లి కాని పిల్లల తల్లిదండ్రుల నుంచి అయినా ఫిర్యాదు అందాల్సి ఉంటుందని, ఫిర్యాదు అందితేనే పోలీసుల యాక్షన్ (Police action) ఉంటుందని ఆ రెగ్యులేషన్ వివరిస్తున్నది. ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభానికి ముందు వరకు ఈ ఫిర్యాదులు వెనక్కి తీసుకోవచ్చని మరో నిబంధన తెలుపుతున్నది.

ఈ డ్రాఫ్ట్ కోడ్‌ (Draft Code)ను మూడు సంవత్సరాల కిందనే అమలు చేయాల్సింది. కానీ, దేశవ్యాప్తంగా వేలాది మంది ఈ చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ చట్టాలు తమ భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేస్తాయని ప్రజలు నిరసనలు చేశారు. దేశ అధ్యక్షుడు, ప్రభుత్వ సంస్థలు, ఇండోనేషియా ప్రభుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడం, పెళ్లికి ముందు సెక్స్‌పైనా నిషేధం విధింంచింది. ముస్లిం మెజార్టీ (Muslim majority) దేశాల్లో అత్యధిక జనాభా గల దేశమైన ఇండోనేషియాలో మహిళలపై వివక్ష ఉన్నది. క్షేత్రస్థాయిలోకి వెళితే మహిళలు, మతపరమైన మైనార్టీలు, ఎల్జీబీటీ (LGBT)లపై వివక్ష ఉన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version