end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంక్షీణిస్తోన్న శశిరేఖ ఆరోగ్యం
- Advertisment -

క్షీణిస్తోన్న శశిరేఖ ఆరోగ్యం

- Advertisment -
- Advertisment -

బెంగళూరు: అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత చెలికత్తె.. శశికళ ఆరోగ్యం విషమించించినట్లు తెలుస్తోంది. బెంగళూరు విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జ్వరం, వెన్నునొప్పితో ఆమె బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని వైద్యులు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇదిలా ఉంటే, అక్రమాస్తుల కేసుకు సంబంధించి పరప్పణ అగ్రహారం జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆరోగ్యం క్షీణిస్తోందంటూ వస్తున్న వార్తలు ఆమె అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన శశికళ.. అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఐసీయూలో చేరారు. దాంతో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదలై చెన్నై రావాల్సిన శశికళ.. ఈలోపే అనారోగ్యానికి గురికావడం పలు అనుమానాలకు తావిస్తోంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -