సీనియర్ నటి టబు నటనపై సహనటి కంగనా రనౌత్(Kangana Ranaut) ప్రశంసల వర్షం కురిపించింది. ఇటీవల వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం2’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందన్న ఆమె 50 ఏళ్ల వయసులోనూ టబు(Tabu) యాక్టింగ్ ఇరగదీస్తుదంటూ పొగిడేసింది. అంతేకాదు కొన్నేళ్లపాటు టబు హిందీ చిత్ర పరిశ్రమను ఒంటరిగా కాపాడుతుందన్న నటి ఈ విషయాన్ని టబుకి స్వయంగా ఫోన్ చేసిన చెప్పినట్లు వెల్లడించింది. అలాగే తన కమిట్‌మెంట్(Commitment) నుంచి ఎంతో ప్రేరణ పొందుతున్నానని, ఇటీవల టబు తనుక స్ఫూర్తిగా(Inspiration) నిలుస్తుందని చెప్పింది.
(Kangana Ranaut:మంత్రగత్తె ముద్ర వేయడంపై కంగన ఫైర్)
‘ఈ సంవత్సరం కేవలం రెండు హిందీ చిత్రాలు ‘భూల్ భూలయ్యా 2(Bhool Bhulaiyaa 2)’, ‘దృశ్యం 2’లు మాత్రమే ఉత్తమంగా నిలిచాయి. ఈ రెండింటిలోనూ సూపర్ స్టార్ టబు జీ ప్రధాన పాత్రలు పోషించింది. ఆమె 50 ఏళ్ల వయసులో నటన నైపుణ్యంతో చంపేస్తుంది. ఒంటరిగా హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుతుంది. ఆమె ప్రతిభను, నిలకడను ఎన్నడూ ప్రశ్నించలేదు. యాభైలలో కూడా ఆమె ఉత్తమంగా కనిపిస్తూ స్టార్‌డమ్(Stardom) శిఖరాన్ని చేరుకోవడం అభినందనీయం. మహిళలు తమ పని పట్ల అచంచలమైన అంకితభావానానికి క్రెడిట్(Credit) పొందేందుకు అర్హురాలు అని నేను భావిస్తున్నా’ అంటూ తన అభిప్రాయాల్ని పంచుకుంది.
https://www.instagram.com/p/CkSY3uYBDLy/?utm_source=ig_web_copy_link