end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుషెజ్వాన్ చికెన్ లాలీపాప్
- Advertisment -

షెజ్వాన్ చికెన్ లాలీపాప్

- Advertisment -
- Advertisment -

షెజ్వాన్ చికెన్ లాలీపాప్ చైనీస్ స్టైల్ డిష్. ఇది త్వరగా ఆకలి తీరుస్తుంది. ఎవరిని అయిన ఇంటికి లంచ్ కి పిలిసినప్పుడు సులభంగా చేయచ్చు. వారి దగ్గర బాగా చేశావ్ అనిపించుకోవచ్చు కూడా. ఈ రెసిపీని మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ లో చికెన్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ మరియు కారం వేసుకుని కలుపుకోవాలి. అలానే అందులోనే షేజ్వాన్ సాస్ కూడా వేసుకుని కలిపి కాసేపు పక్కన ఉంచుకోవాలి. అందులో గుడ్డు, కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదా, వరి పిండి కూడా వేసి పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోండి. ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నూనెని ఒక పాన్ లో వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత వీటిని అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి తురిమిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లికాడలు, గ్రీన్ చిల్లీ సాస్ మరియు షేజ్వాన్ సాస్ వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా మరిగించండి. ఇప్పుడు ఒక చిన్న కప్ లో కార్న్ ఫ్లోర్ ని వేసి దానిలో నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని ప్యాన్ లో వేస్తే అది థిక్ గా అవుతుంది.ఇప్పుడు ఈ మిశ్రమంలో లాలీపాప్స్ వేసుకుని గ్రేవి అంతా కూడా చికెన్ ముక్కలకి అంటే లాగా కలుపుకోవాలి. అంతే రెసిపీ రెడీ అయిపోయింది ఎంజాయ్ చేస్తూ తినచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -