end

గంటాకు షాక్‌.. ఆస్తుల్ని వేలం వేయనున్న బ్యాంక్‌

ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి, టీడీపీ శాసనసభ్యులు గంటా శ్రీనివాస్‌రావుకు ఇండియన్‌ బ్యాంక్‌ షాకిచ్చింది. ఆయనకు చెందిన ప్రత్యూష కంపెనీ లిమిటెడ్ ఆస్తుల్ని వేలం వేయనున్నట్లు ప్రకటించింది. ఈ వేలం ప్రక్రియ ఈనెల 25న జరగనుంది. శ్రీనివాస్‌రావు ఇండియన్‌ బ్యాంక్‌ నుంచి తీసుకున్న రూ. 248 కోట్ల తాలూకు వడ్డీని చెల్లించాల్సిందిగా 2006 సంవత్సరంలో నోటీసులిచ్చింది. దీనిపై శ్రీనివాస్‌రావు గానీ, కంపెనీ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో 2016, 2017 సంవత్సరాల్లో కంపెనీ కుదువపెట్టిన ఆస్తుల్ని బ్యాంక్‌ స్వాధీనం చేసుకుంది. ఈ సారి ఏకంగా ప్రత్యూష కంపెనీలోని 9 రకాల ఆస్తుల్ని వేలం వేయడానికి బ్యాంక్‌ సిద్దపడింది.

Exit mobile version