end

Horse: గుర్రాలకు బూట్లు..

  • అక్టోబర్ 24 నుంచి ఆన్‌లైన్‌లో ‘హార్స్ కిక్స్’
  • కొనుగోలుదారుల కోసం ప్రత్యేక వెబ్ సైట్
  • $1,200 నుంచి ప్రారంభం అవుతున్న ధరలు

‘గుర్రాల కోసం షూస్’ ఈ కాన్సెప్ట్ చాలా ఏళ్లుగా పరిశీలనలో ఉన్నా ఎట్టకేలకు ఇప్పుడు సక్సెస్ (success)అయింది. కొన్ని కారణాల వల్ల వందల ఏళ్లుగా వాస్తవ రూపం దాల్చకుండా పోయిన ఈ ప్రయోగం (experiment) ఇప్పుడు Air Jordan అండ్ Yeezy Boost వంటి ప్రసిద్ధ హ్యూమన్ స్నీకర్స్ (Human sneakers)నమూనాను పోలిన ‘హార్స్ కిక్స్’ (‘Horse Kicks’) అనే బూట్లను మార్కస్ ఫ్లాయిడ్ (Marcus Floyd)రూపొందించాడు. అంతేకాదు వీటిని త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురాబోతుండగా.. వీటి ధర దాదాపు లక్ష (1 Lakh)రూపాయాల నుంచి ప్రారంభం కావడం విశేషం. 

‘స్నీకర్ కస్టమైజింగ్ ఎక్స్‌పర్ట్, ది షూ సర్జన్, SRGN అకాడమీ’ పూర్వ విద్యార్థి మార్కస్ ఫ్లాయిడ్‌ ఈ ప్రయోగానికి నాంది పలికాడు. రీకన్‌స్ట్రక్షన్, డీకన్‌స్ట్రక్షన్ ఉపయోగించి స్నీకర్స్‌ను క్రియేట్ చేసిన ఫ్లాయిడ్.. వీటిని Air Jordan, Yeezy లేదా New Balance 650 వంటి బ్రాండ్స్ కలిగిన ప్రత్యేక అంశాలతో రూపొందించాడు. ఇదే సమయంలో ఇవి గుర్రపుడెక్కల ఎర్గోనామిక్స్‌కు సరిపడేలా తయారుచేయబడ్డాయి.ఇక తన కొత్త వ్యాపారం ‘హార్స్ కిక్స్’ ప్రారంభించేందుకు  2022 సీజన్ కోసం అనేక ప్రీ-మేడ్ స్టైల్స్‌ (Pre-made styles)ను రూపొందించాడు  మార్కస్. ఇందులో ఎయిర్ జోర్డాన్ 1 హై ‘కోర్ట్ పర్పుల్’, (‘Court Purple) అడిడాస్ యీజీ బూస్ట్ 350 V2 ‘డాజ్లింగ్ బ్లూ’, ఐమ్ లియోన్ డోర్ x న్యూ బ్యాలెన్స్ 650 వంటి ప్రముఖ మోడల్‌ల నుంచి ప్రేరణ పొందిన హార్స్ స్నీకర్లు ఉన్నాయి.  అక్టోబరర్ 24 నుంచి కస్టమ్ ‘హార్స్ కిక్స్’ కంపెనీ వెబ్‌సైట్ (website)ద్వారా ఆర్డర్ (order)చేసుకునేందుకు వీలు కల్పిస్తుండగా.. వీటి ధర $1,200 నుంచి ప్రారంభమైన హై రేంజ్‌లో ఉండనున్నాయి.

అయితే స్నీకర్స్ గురించి ప్రత్యక్షంగా తెలుసుకుని కొనుగోలు (purchase) చేయాలనుకునేవారికోసం ‘బ్రీడర్స్‌కప్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌’ (Breeders’ Cup World Championship)లో నవంబర్ (november) 4, 5వ తేదీల్లో బూత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఫ్లాయిడ్ ప్రకటించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ (viral)అవుతుండగా ‘ప్రస్తుతం షూ షాపుల ముందు షూస్ ట్రై చేసేందుకు నిలబడిన జనాలను మాత్రమే చూస్తున్నాం. కానీ, ఇంకొద్ది కాలంలో హార్స్ కూడా స్నీకర్స్ కోసం ఇదే విధంగా క్యూ కట్టడాన్ని చూస్తామేమో’ అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

(Doctor:అత్యంత వృద్ధ డాక్టర్..)

Exit mobile version