- ఉలిక్కిపడ్డ భాగ్యనగర ప్రజలు
- ఒకరి మరణం మరొకరికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ నగరం మరోసారి దద్ధరిల్లింది. భాగ్యనగరం నడిబొడ్డున మరోసారి కాల్పుల మోత (Gun fire) మోగింది. ఓ బంగారు షాపు (gold shop) లోకి వచ్చిన ఇద్దరు ఆగంతకులు కాల్పులు జరిపి షాప్ యజమానిని బెదిరించారు. దుకాణంలోని బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. నీరుస్ సర్కిల్లో ( Niru’s circle) ఈ ఘటన జరిగింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఉస్మానియాకు (Osmania) తరలించారు. అతను నగరానికి చెందిన ఇస్మాయిల్ (Ismail)గా గుర్తించారు.
కాల్పులు జరిపింది ముజీబ్ (Mujib) అని అంటున్నారు. స్థిరాస్తి (property) గొడవల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయాలతో ఉన్న అతడ్ని తోటి స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పుల అనంతరం బైక్ పై పరారయ్యాడు ముజీబ్.అయితే ఈ కాల్పులు నాగోల్ స్నేహపురి కాలనీలో కాల్పులు స్థానికంగా కలకలం రేపాయి. సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా ఇటీవల నగరంలో వరుసగా కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరోసారి కాల్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు.