షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. షాపింగ్ అంటే ముందు ఉంటారు ఆడవాళ్ళు గుర్తువస్తారు కదా. ఎన్ని గంటలు షాపింగ్(Shopping) చేసిన అరే అప్పుడే టైమ్ అయిపోయింద అంటూ ఇంకా ఏదో కావాలి అని చూస్తూ ఉంటారు. ఔనా కదా మీరే ఆలోచించండి. మగవారు అయితే అమ్మో షాపింగ్ ఆ అంటూ ముందు బయపడతారు, ఇంకా వారి లిస్ట్ చెప్పకముందే. ఇప్పుడు ఏది కావాలి అన్నా ఒకేదగ్గర మనకు అందుబాటులో ఉన్నాయి. అవి మన షాపింగ్ మాల్స్. కొన్ని రోజుల ముందు అయితే మనం ఏది కావాలి అంటే ఆ షాప్ కి వెళ్ళే వాళ్ళం. కిరాణా షాప్ అని బేకరీ అని ఎలా ఏది కావాలి అంటే ఆ షాప్ కి మాత్రమే వెళ్ళే వాళ్ళం కదా కానీ ఎప్పుడు ఏది కావాలి అన్నా మనకి నచ్చిన షాపింగ్ మాల్(Shopping mall) కి వెళ్తే సరిపోతుంది. అన్నీ ఒకే దగ్గర దొరుకుతున్నాయి.ఇంట్లో కి కావలిసిన రేషన్ వస్తువులు కానీ క్లోత్స్ కానీ ఫుడ్ కానీ కిడ్స్ కి గేమ్స్ కానీ .ఇలా ఏది కావాలి అన్నా ఒకే దగ్గర ఉన్న వాటికే మొగ్గుచూపుతారు ఎవరుఅయినా.అంతక ముందు అయితే బాగా డబ్బు ఉన్నవారు లేదా నెలసరి జీతం ఎక్కువ ఉన్న వాళ్ళు షాపింగ్ మాల్స్ కి వెళ్ళే వాళ్ళు కానీ ఎప్పుడు చిన్న పెద్ద అని లేకుండా అందరూ వెళ్తున్నారు.
వెళ్ళడం తప్పు కాదు కానీ ఏ వస్తువు కి ఎంత పెట్టాలో ఏది కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్(List Prepare) చేసుకొని వెళ్తే బాగుటుంది మనకి మనీ సేవ్(Money Save) అవుతాయి. ఎందుకు అంటే మన లిస్ట్ లో ఉన్న వస్తువులు కొన్న తర్వాత ఇంకా ఏమి కోనాలి అనిపించదు, అప్పటికే టైమ్ కాస్త అయిపోతుంది. ఈ లోగా మనతో వచ్చిన పిల్లలు పిడుగులు ఉర్కుంటర చెప్పండి, స్నాక్స్ అంటారు లేదా గేమ్స్ అంటారు కదా అప్పుడు మనం తప్పక తీసుకొని వెళ్ళాల్సిందే. పిల్లల సంతోషం కంటే మనకి ఏది ముఖ్యం కదా సంపాదించేది వారికోసం కదా. కానీ కొన్ని గేమ్స్ ముందు సెలెక్ట్(Select) చేసుకోవాలి అని ముందు చెప్తే వేరే గేమ్స్ ఉన్న వారి చిన్న మనసు ఎంచుకున్నవాటి మీదే దృష్టి పడుతుంది. వేరే గేమ్స్ జోలీ కి పోరు. అప్పుడు మీకు ఖర్చు తక్కువ అవుతుంది. ఇలా ఒక ప్లాన్(Plan) ప్రకారం వెళ్తే ఏమి కాదు. అదే మనకి క్లారీటి(Clarity) లేకుండా షాపింగ్ వెళ్ళి ఏది పడితే అది కొని చివరిలో బిల్ చూసి అవ్వక్ అవాల్సిందే.
ఇంకో విషయం ఏంటి అంటే షాపింగ్ మాల్స్ లో ఆఫర్లు, తగ్గింప్పు(Discount) ధరలని మానలని ఎక్కువ అకర్షిస్తు ఉంటారు. అప్పుడు మనం కొంచం కంట్రోల్ చేసుకోవాలి. లేదో మనకి అవసరం లేకపోయిన కోనాల్సి ఉంటుంది. తప్పు మనది కాదు ఆఫర్లు మహిమా.అందుకే ఏది కావాలి ఒక నెల కి సరిపాడ తెచ్చుకోవాలి మన లిస్ట్ ప్రకారం కొనుకొని ఏదైనా మధ్యలో అవసరం అయితే మన చుట్టుపక్కల ఉండే దుకాణాలకు వెళ్లి కొనుక్కోవచ్చు. మాల్స్ లో షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్ల(Offers)కు ఆకర్షితులు కాకుండా మనకు కావల్సిన వస్తువులను మనం ఎంపిక చేసుకుంటే షాపింగ్ సమయంలో డబ్బులు వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఏది అయినా ప్రయత్నించి చూస్తే తప్పు లేదు కదా.