- కేంద్రంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సీరియస్
- పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్
- జీఎస్టీ వసూళ్ల షేర్‌ను నిలిపేస్తామంటూ హెచ్చరికలు
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి కేంద్ర ప్రభుత్వం బీజేపీ (BJP) తీరుపై సీరియస్ కామెంట్స్ చేసింది. తమ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ (Pending funds)నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు లేదంటే దిగిపోండి. అలా కాదంటే.. జీఎస్టీ (GST) వసూళ్ల షేర్‌ను (Share) నిలిపేస్తామంటూ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈ విషయంపై ఇప్పటికే ప్రధానిని కలిశానన్న ఆమె మళ్లీ వసూళ్లకోసం ఆయన కాళ్లపై పడాలా? అంటూ ఎద్దేవా చేసింది.
కేంద్రం, పశ్చిమబెంగాల్ (West Bengal) సర్కార్ మధ్య వార్ (war)మరింత ముదిరింది. ఇప్పటికే పలు విషయాల్లో కేంద్రంతో విభేదిస్తున్న సీఎం మమతా బెనర్జీ.. తాజాగా మరో సీరియస్ వార్నింగ్ (Warning) ఇచ్చారు. ఝార్‌గ్రామ్ (Jhargram)లో జరిగిన గిరిజనసభలో పాల్గొన్న దీదీ.. ప్రధాని మోదీపైనా, కేంద్రంపైనా నిప్పులు చెరిగారు. GST పరిహారం కింద రావల్సిన బకాయిల కోసం మీ కాళ్ల మీద పడి అడుక్కోవాలా అంటూ.. ప్రధాని మోదీని నిలదీశారు. మనం ప్రజాస్వామ్యంలో (Democracy) ఉంటున్నామా లేక ఒకే పార్టీ అధికారంలో ఉన్న దేశంలో ఉన్నామా అంటూ ప్రశ్నించారామె. ఉపాథిహామీ నిధులు ఇస్తే ఇవ్వండి, లేకుంటే అధికారంలో నుంచి దిగిపొండి అంటూ గర్జించారు. అంతేకాదు కేంద్రం నుంచి తమకు రావాల్సిన పెండింగ్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, లేదంటే రాష్ట్రం నుంచి కేంద్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ వసూళ్ల షేర్‌ను నిలిపేస్తామని హెచ్చరించారు.
(PM MODI:చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ భేటీ)
ఝార్‌గ్రామ్‌లో గిరిజన స్వాతంత్ర్య సమర యోధుడు భగవాన్ బిర్సాముండా (Freedom fighter Bhagwan Birsa Munda) జయంతి వేడుకల్లో పాల్గొన్న మమత.. అక్కడి నుంచే కేంద్రానికి హెచ్చరికలు పంపారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వడంలో కేంద్రం ఏమాత్రం మేలు చేయడం లేదని మమతా బెనర్జీ అన్నారు. జీఎస్టీ రూపంలో మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. దీని వల్ల అన్ని రాష్ట్రాలు లాభపడతాయని అన్ని రాష్ట్రాలూ (States)ఆశగా ఉన్నాం కానీ ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రతిదానికీ పన్ను (Tax) చెల్లిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకుంటోంది కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తోందన్నారు.
ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) నిధుల బకాయిల్ని కేంద్రం విడుదల చేయడం లేదని, అందుకు నిరసనగా గిరిజనులంతా (tribes) రోడ్లపైకి రావాలని మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఉపాధి హామీ నిధుల్ని కూడా అడుక్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రధాని మోదీ బాటలోనే మమతా బెనర్జీ కూడా డ్రమ్స్ వాయించి అక్కడున్న వారిని అలరించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మమతా బెనర్జీ గిరిజన వర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ సంప్రదాయ డోలు వాయించారు. బెంగాల్ ప్రభుత్వానికి నిధులు ఇవ్వవద్దని కొందరు ఢిల్లీని (Delhi) వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే డప్పులు, బాణాలు, దౌర్జన్యాలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలను చెప్పాలన్నారు.
టీ షాప్‌లో పకోడాలు వేసిన మమత: ఝర్‌గ్రామ్‌లో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన కాన్వాయ్‌ను రోడ్డు పక్కన టీ స్టాల్ దగ్గర ఆపి ప్రజలకు పకోడాలు అందించారు. ఆ సమయంలో టీ దుకాణం (Shop) వద్ద జనం గుంపులు గుంపులుగా కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో (video) కూడా సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతుంది. ఇందులో మమత పేపర్‌లో పకోడాలను చుట్టి ప్రజలకు పంచింది.