end

Sonyaa Ayodhya:భార్యల తొడలు భర్తలకే చూపించాలా?

బీటౌన్ హాట్ బ్యూటీ(Hot Beauty) సోన్యా అయోధ్య సామూర్.. సినిమా షూటింగ్ టైమ్‌లో తనకు ఎదురైన భయంకరమైన సంఘటనల గురించి ఓపెన్ అయింది. సోనియా గుప్తా, సోనియా పింక్ అని కూడా పిలవబడే ఈ భామ 21 ఏళ్లకే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అనతికాలంలోనే స్టార్ నటిగా ఎదిగింది. టెలివిజన్ ధారావాహిక ‘నాజర్‌’(Nazar)లో రూబీ పాత్రతో ప్రసిద్ది చెందిన ఆమె ఆ తర్వాత ‘కసౌతి జిందగీ కే’తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే 2019లో ప్రియుడు హర్షవర్ధన్ సమోర్‌ను వివాహం చేసుకున్న హాటీ పెళ్లైనా వెనకడుగు వేయకుండా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది.

అయితే ఇటీవల తాను నటించిన ‘కసౌతీ జిందగీ కే 2’ సెట్‌లో ఓ మేల్ కో‌స్టార్(Co star) తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు షూటింగ్ టైమ్‌లో ఓ స్టార్ నటుడు సాధారణ మగాడి బుద్ధి చూపించాడని ఆందోళనకు గురైన సోన్యా.. ‘ఓ సన్నివేశంలో భాగంగా నా శరీరాన్ని టార్గెట్(Target) చేస్తూ మాట్లాడాడు. నిమిషానికోసారి బాడీని బట్టలతో  కప్పి ఉంచమంటూ వెంటపడి వేధించాడు. అంతటితో ఆగకుండా ఆడవాళ్లు కుర్చిలో కూర్చొని కాళ్లను ఆడించవద్దన్నాడు. తర్వాత తొడలను(Thighs) పూర్తిగా దుస్తులతో కప్పేయమన్నాడు. ఎందుకంటే అవి భర్తలకు మాత్రమే చూపించాలని ఉపదేశమిచ్చాడు. అంతేకాదు మగ మతోన్మాదిగా వ్యవహరిస్తూ మహిళలు నిశ్శబ్దంగా ఉండాలని ఆదేశించాడు. బాడీ స్ట్రక్చర్, డ్రెస్సింగ్(Dressing), ఆహార ఎంపికలతోపాటు మతం విషయంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో అతన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు షూటింగ్ సమయంలోనూ సెట్‌లో గంటల తరబడి వేచి ఉండేలా చేశాడన్న ఆమె.. ఇది వృత్తిపరంగా ఆమోదయోగ్యం కాదని తెలిపింది. చివరగా ఇలాంటి పురుషులున్న సిని పరిశ్రమలో తనలాంటి కొత్త అమ్మాయిలు రాణించడం పెద్ద సవాలుగా మారిందంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించిన నటి అతడెవరో చెప్పకుండానే ముగించింది.

(Kangana Ranaut:మంత్రగత్తె ముద్ర వేయడంపై కంగన ఫైర్)

.

Exit mobile version