end

God:దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టుకోకూడదా?

గుళ్లో దేవునికి ఎదురుగా నిలబడి(In Front of) నమస్కారం పెట్టకూడదు. ఒక పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామి వారికి, ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యన నిలబడకూడదు. ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని(Powers) స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాం. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. ఇది శని ఆలయంలో వర్తించదు. శనైశ్చరుని(Saturn)కి ఎదురుగా నిలబడి నమస్కరించాలి.

ఇంట్లో పూజామందిరం ఇంట్లో ఏ దిశగా ఉండాలి?

పూజామందిరాన్ని ఇంటిలో ఈశాన్యదిక్కులో(In the north-east direction) ఏర్పాటు చేసుకోవాలి. తూర్పు, ఉత్తర దిక్కుల మధ్య ఉన్న ప్రాంతమే ఈశాన్యం. పూజ చేసుకునేవారు తూర్పు లేదా ఉత్తర దిక్కులకు తిరిగి కూర్చోవడం మంచిది. అంటే దైవాన్ని పడమటివైపు కానీ, దక్షిణంవైపు కానీ ఉండేలా అమర్చుకోవాలి. ఇంటి వైశాల్యాన్ని బట్టి వీలు లేకపోతే చిన్న అల్మరా వంటిది పెట్టుకోవచ్చు. కనీసం ఒక్క ప్రతిమ లేదా ఫోటో(Photo) అయినా ఈశాన్య దిక్కున ఉంచుకోవాలి.

(Budh Pradosh Vrat:బుధ ప్రదోష వ్రతం)

Exit mobile version