end

Shreya Dhanwanthary: పదేళ్లు నరకం చూశానన్న స్టార్ బ్యూటీ

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ శ్రేయా ధన్వంతరి (Shreya Dhanwanthary).. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన తాజా హిందీ చిత్రం ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’(Chup: Revenge of The Artist). ఇటీవలే విడుదలైన ఈ మూవీ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో కీలకపాత్రలో నటించిన మెప్పించిన నటి శ్రేయా.. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన గత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఈ మేరకు మొదటి సినిమా రిలీజ్ అయ్యేంతవరకూ ‘హోమ్ లెస్’గా (Home less) ఉన్నట్లు తెలిపింది. అలాగే వినోద పరిశ్రమలో అడుగుపెట్టడానికి దాదాపు పదేళ్లు (10 years) పోరాటం చేశానని చెప్పింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎన్నోసార్లు తీవ్ర బాధలు ఎదుర్కొన్నానన్న శ్రేయా.. నిరాశ్రయుల జాబితాలో చేరిపోయినట్లు చెప్పింది. ఇక ఇంజనీరింగ్ (Engineering) చదువుకోసం దుబాయ్, (Dubai) బహ్రెయిన్ (Bahrain) ఖతార్‌ (Khatar) లలో ఉన్నప్పుడు ఆకలితో అలమటిస్తూ దారుణమైన జీవితాన్ని గడిపినట్లు భావోద్వేగానికి లోనైంది. ఈ క్రమంలోనే ఎలాగైనా నటిగా పని సంపాదించడంపై దృష్టి పెట్టాలని బలంగా నిర్ణయించుకున్నానన్న ఆమె.. ఇండియా (india)కు తిరిగొచ్చి ‘ఫెమినా మిస్ ఇండియా సౌత్’ (Femina miss south) 2008లో పాల్గొని ఫైనలిస్ట్‌లో ప్లేస్ సంపాదించినట్లు తెలిపింది. దీంతో 2010లో ‘స్నేహ గీతం’ అనే తెలుగు చిత్రాలలో కనిపించడం, తర్వాత ‘వై చీట్ ఇండియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

శ్రేయ కొన్ని నెలల వయస్సులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విదేశాలకు వెళ్లిపోయారు. దుబాయ్, బహ్రెయిన్, ఖతార్ వంటి దేశాల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అనంతరం ఇంజినీరింగ్ కోసం భారతదేశానికి తిరిగి వచ్చింది. అప్పుడే ఈ భామకి నటి అవ్వాలనే లక్ష్యం ఏర్పడింది. దాంతో అప్పటి నుంచే పలు ప్రయత్నాలు చేయడం ప్రారంభించింది.  ఈ మేరకు శ్రేయ మాట్లాడుతూ.. ‘నా సినీ ప్రయాణం చాలా కష్టంగా సాగింది. చదువుకునే రోజుల్లోనే నాకు సినిమాల్లో నటించాలనే కోరిక కలిగింది. కానీ.. ఆ విషయాన్ని ఇతరులకి తెలియకుండా రహస్యంగా ఉంచాను. ఎందుకంటే నాలాంటి వారికి ఇది చాలా హాస్యాస్పదంగా, సాధించలేని విధంగా ఉంటుందని భావించాను. కానీ.. ఇప్పుడు ఇక్కడ ఉండడం నమ్మలేకపోతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే 2009లో నాగచైతన్య ‘జోష్’ టాలీవుడ్‌లో అడుగుపెట్టి, 2010లో ‘స్నేహ గీతం’ చిత్రం ఓ ప్రధానపాత్రలో నటించింది. అనంతరం దాదాపు పది సంవత్సరాల తర్వాత ఆమె ఇమ్రాన్ హష్మీ నటించిన ‘వై చీట్ ఇండియా’తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం చేసిన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సోనీ లీవ్ సిరీస్ ‘స్కామ్‌ 1992’తో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందింన శ్రేయా.. సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించకుంది.

(కాజల్ రీ ఎంట్రీ)

Exit mobile version