end
=
Saturday, November 23, 2024
వార్తలురాష్ట్రీయంSiddipet :విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట
- Advertisment -

Siddipet :విద్య వైద్య క్షేత్రంగా సిద్దిపేట

- Advertisment -
- Advertisment -
  • అంచెలంచలుగా అభివృద్ధి
  • రూ. 26కోట్లతో బీ ఫార్మసీ కళాశాల

Siddipet : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం  రామంచ శివారులో  హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ(Hyderabad Exhibition Society) నిర్మించనున్న శ్రీ రంగనాయక స్వామి బీ ఫార్మసీ కళాశాల భవన నిర్మాణానికి శంఖుస్థాపన(Foundation) చేసిన మంత్రి హరీష్ రావు(Harish Rao). పాల్గొన్న జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఏంపీపీ మాణిక్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటను విద్య వైద్య క్షేత్రంగా మారుస్తున్నాo. సిద్దిపేటలో  వైద్య విద్యలో మొత్తం1350 మంది ఏంబీబీఏస్ (MBBS) విద్యార్థులు ఉన్నారు. సిద్దిపేటలో ఎల్అండ్ టీ సంస్థతో 500  మందికి శిక్షణ, ఉపాధి కల్పిస్తాం.సిద్దిపేటలో బీ ఫార్మసీ (B.Pharmacy) కళాశాల రావడం చాలా ఆనందంగా ఉంది. సిద్దిపేట రంగనాయక సాగర్(Ranganayak Sagar) లక్ష ఏకరాలు సాగు నీరు పారుతది.

మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నీక్, మెడికల్ కళాశాల(Medical College), కేంద్రీయ విద్యాలయం. పీజీ కళాశాల, నర్సింగ్ కళాశాల. BVSE వేటర్నెటీ కళాశాల. ప్రభుత్వ గురుకుల పాఠశాల లు..L&T వారు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కోచింగ్ సెంటర్ తీసుకు వస్తున్నాం…సెట్విన్ ట్రైనింగ్ సెంటర్..ఆంధ్రాబ్యాంకు(Andhra Bank) ఆధ్వర్యంలో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసాం.ఇప్పుడు ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో  వేలాది మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నారు.

వేలాది, లక్షలాది మంది గ్రామీణ విద్యార్థులకు, బాలికలకు విద్యను అందిస్తున్నారు.. ఇది చాలా గొప్ప విషయం.ఎగ్జిబిషన్ లద్వారా వచ్చే ఆదాయంతో  ఈ విద్యా సేవ చేస్తున్నారు.సిద్దిపేటలో 26 కోట్ల(26 Crores) రూపాయలతో ఈ బీ ఫార్మసీ కళాశాల  నిర్మిస్తున్నారు.ఒక్క కేసు లేకుండా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించాం. భవిష్యత్ లో ప్రభుత్వంతో మాట్లాడి ఒక యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటాం.వచ్చే విద్యా సంవత్సరం నుండే ఇక్కడ విద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తాం.ఇది ఈ ప్రాంత విద్యార్థులకు ఒక వరం లాంటి కళాశాల.భవిష్యత్ లో ఈ ప్రాంత విద్యార్థులకు అవసరమైన, ఉపాధి అవకాశాలు కల్పించే  కోర్సులను ఏర్పాటు చేస్తాం.కళాశాల భవన నిర్మాణానికి., ఎగ్జిబిషన్ సొసైటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తాం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -