end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంవాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు
- Advertisment -

వాగులో గల్లంతైన టిఆర్‌ఆర్‌ నాయకుడు

- Advertisment -
- Advertisment -

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు రాష్ర్టమంతటా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు జంగపల్లి శ్రీనివాస్‌ వాగులో కొట్టుకుపోయారు. సిద్దిపేట జిల్లా శనిగరం – బద్దిపల్లి వాగులో గల్లంతైనట్లు తెలుస్తుంది. శ్రీనివాస్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి టొయోటా ఇన్నోవా వాహనంలో మంథని బయలుదేరి వెళ్లారని, ఈ మార్గంలో మద్దకుంట వద్ద గల వాగు పొంగి పొర్లుతుండడంలో వాహనం వాగులో కొట్టుకపోయినట్లు సమాచారం. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి ముగ్గురిని రక్షించగా ఇన్నోవా కారుతోపాటు శ్రీనివాస్‌ వరద నీటిలో కొట్టుకుపోయారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ వెంటనే స్పందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశానుసారం సిద్దిపేట ఆర్డీఓ ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను సమీక్షిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -