end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంఏపీ అసెంబ్లీ గత స్పీకర్, ఇప్పటి స్పీకర్‌ మధ్య సారూప్యత
- Advertisment -

ఏపీ అసెంబ్లీ గత స్పీకర్, ఇప్పటి స్పీకర్‌ మధ్య సారూప్యత

- Advertisment -
- Advertisment -

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా స్పీకర్‌గా కోడెల శివప్రసాద్‌ను ఎన్నుకున్నారు. అయితే ఆయన అంతే హూందాతనంగా వ్యవహరించేవారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారంటే.. ఎంత దారుణంగా మా గొంతు నొక్కేస్తున్నారంటే.. అనే మాటలకు, స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై చేసిన విమర్శలు.. ‘దిసీజ్ నాట్ ద వే’ అంటూ పదే పదే ఇంగ్లీష్‌లో హెచ్చరించేవారు. ఏనాడూ పరుష పదజాలం విపక్ష సభ్యులపైగానీ, ప్రతిపక్ష నాయకుడిపైగానీ ప్రయోగించలేదు.

కానీ, ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఉడత ఊపులంటూ ప్రతిపక్ష సభ్యులను కించపరిచేలా మాట్లాడడం, పేపర్లు విసిరిగొట్టి బెదిరింపు ధోరణిలో మాట్లాడడం వంటివి చేస్తున్నారు. అధికారపక్ష నేతలు, విపక్షనేతలపై విమర్శలు చేస్తున్నప్పుడు సర్దిచెప్పే బదులు ముసిముసి నవ్వులు ఒలకపోయడం, మాటిమాటికి విపక్ష సభ్యులను హెచ్చరిండం ఆయనకు పరిపాటి అయింది. ఇప్పటికైనా స్పీకర్‌ తమ్మినేని తన వ్యవహారం మార్చుకోకపోతే ఆయన రాజకీయ భవిష్యత్‌కు చాలా ప్రమాదకరం అంటున్నారు. రాజకీయ విశ్లేషకులు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -