- తొలి సూపర్ 500 టైటిల్ సొంతం
సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను తొలిసారి పివి సింధు సొంతం చేసుకుంది. తన కేరీర్‌లో తొలి సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకుంది. సింగపూర్ ఓపెన్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్-జి-యిని పై గెలుపు సాధించింది. పివి సింధు వాంగ్‌పై 21-9, 11-21, 21-15 తేడాతో విజయం సాధించింది. సింధుకి ఇది మూడో టైటిల్ కావడం విశేషం. అయితే అద్భుతంగా ఆడుతున్న పివి సింధును 11 వ ర్యాంకర్ చాలా ప్రతిఘటించింది. కాగా తొలి ఆటలో సింధు 21-9 తేడాతో చాలా సులువుగా గెలిచింది.
కానీ రెండో ఆటలో వాంగ్ పుంజుకొని సింధును 11-21 తేడాతో ఓడించింది. చాలా హోరాహోరీగా జరిగిన సింగపూర్ ఓపెన్ ఫైనల్స్‌లో తొలి హాఫ్ ముగిసేసరికి సింధు 11-6తో ముందంజలో ఉన్నారు. అయితే బ్రేక్ తర్వాత వాంగ్ పాయింట్లను సాధించడంతో సింధు 17-44కి వెళ్లింది. వాంగ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా పాయింట్లు సాధించి 21-15 తేడాతో మూడో గేమ్ గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది పివి సింధు