end
=
Friday, September 20, 2024
సినీమాపెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్‌
- Advertisment -

పెళ్లిపై సింగర్ సునీత రియాక్షన్‌

- Advertisment -
- Advertisment -

ఆస్ర్టేలియా టూర్‌కు షమీ దూరం

‘సింగర్‌ సునీత’.. ఇటీవల సినీ ఇండస్ట్రీలో భీభత్సంగా వినిపిస్తున్న పేరు. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత.. చాలా గ్యాప్‌ తర్వాత తన పిల్లల ఆధ్వర్యంలో రెండో పెళ్లికి సిద్ధమైంది. ఇటీవలే ఈ పెళ్లికి సంబంధించి రామ్‌ వీరపనేనితో నిశ్చితార్థ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్‌ 27న పెళ్లి అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ పెళ్లి వాయిదా పడిందని, రాబోయే సంవత్సరంలో సునీత, రామ్‌ల వివాహం జరగనుందని రీసెంట్‌గా వార్తలు బయటికి వచ్చాయి. అయితే తాజాగా సునీత ఓ చీరల షోరూమ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సునీత, అక్కడ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

రేపట్నుంచి ఇంటర్‌ క్లాసులు ప్రారంభం

ఈ సందర్భంగా.. మీరు స్టోర్‌కి కాదు శారీకి అంబాసిడర్‌.. ఎందుకు శారీ అంతగా ఇష్టపడతారు.. అని మీడియా వాళ్లు అడిగితే.. ”నాకు చీరలంటే చాలా ఇష్టం. చీరలో హుందాతనం ఉంటుంది. చీరలో మన పర్సనాలిటి రిఫ్లెక్ట్ అవుతుంది. నాకు నా పాట, చీర ఒక ప్యాకేజ్‌లా అనిపిస్తాయి. మన నడవడిక ఎలా ఉంటుందో.. దానితో పాటే మనలో ఉన్న టాలెంట్‌ కూడా అవతలి వారికి అర్థమవుతుందని నేను భావిస్తాను.” అని సునీత తెలిపారు.

రైతుబంధు రావట్లేదా..?

ఇక మీకు పెళ్లి కుదిరింది కదా.. ఇక్కడ చేసుకుంటారా? లేక బయట ఎక్కడైనా ప్లాన్‌ చేస్తున్నారా? అంటే.. ”నవ్వుతూ.. కొట్టేస్తాను” అని సునీత అన్నారు. అసలు మీ పెళ్లి ఎప్పుడు జరగబోతోంది? అని అడిగితే.. ‘హుష్‌..’ అంటూ వేలితో నోటిని కవర్‌ చేశారు. సో.. ఆమె మూమెంట్స్‌ని బట్టి.. సునీత పెళ్లి ఇప్పుడప్పుడే కాదని అర్థమవుతోంది.

పెద్ద మనసు చాటుకున్న మంత్రి హరీష్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -