టాలీవుడ్ క్రేజీ సింగర్స్‌లో సునీత ఒకరు. ఈమె కేవలం సింగర్‌గానే కాకుండా వ్యాఖ్యాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సునీతకు ముందే వివాహమైంది. కానీ, దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో వారు విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. గత కొంతకాలంగా సునీతగా ఒంటరిగానే ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆమె రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు కూడా. కొన్ని రోజుల ముందు నుంచి సునీత రెండో పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలు నిజమేనని రుజువు చేస్తూ సింగర్ సునీత సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి విషయాన్ని తెలియజేశారు. డిజిటల్ మీడియా అధినేత రామ్ వీరపనేనితో సోమవారం సునీత నిశ్చితార్థం జరిగింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సునీత తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలిపారు.
కటుంబ సభ్యుల సమక్షంలోనే నిశ్చితార్థం..
ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. ప్రతి తల్లిలాగానే నేను నా పిల్లలు లైఫ్‌లో సెటిల్ కావాలని ఆశించాను. అదే సమయంలో నేను జీవితంలో స్థిరపడాలనుకునే మంచి ఆలోచన ఉన్న పిల్లలతో నేను ఆశీర్వదించబడ్డాను. రామ్ నా జీవితంలో ఒక శ్రద్ధగల స్నేహితుడిగా, అద్భుతమైన భాగస్వామిగా ప్రవేశించాడు. మేం ఇద్దరం అతి త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. నేను నా జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా ఉంచుతున్నాను. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు’ అని సునీత మెసేజ్ చేశారు.